ఎవరైనా
నీ హృదయాన్ని
కరిగిస్తామంటే
కాదనకు
ఎవరైనా
నీ గుండెను
రగిలిస్తామంటే
వద్దనకు
ఎవరైనా
నీ తలను
తొలుస్తామంటే
అభ్యంతరంచెప్పకు
ఎవరైనా
నీ మనసును
మదిస్తామంటే
నివారించకు
ఎవరైనా
నీ నోటిలో
మాటలుపెడతామంటే
వ్యతిరేకించకు
ఎవరైనా
నీ కళ్ళకు
అందాలుచూపుతామంటే
అడ్డుచెప్పకు
ఎవరైనా
నీ చెవుల్లో
ఊదుతామంటే
అక్షేపించకు
ఎవరైనా
నీ ఉల్లానికి
ఉత్సాహమిస్తామంటే
ఆటంకపరచకు
ఎవరైనా
నీ తెలివికి
పరీక్షపెడతామంటే
ప్రతిఘటించకు
ఎవరైనా
నీ మీద
విజయంసాధిస్తామంటే
కోపగించకు
దేనిలో
ఏముందో?
ఏపుట్టలో
ఏపాముందో?
ఎవరిలో
ఏశక్తి ఉన్నదో?
ఎవ్వరిలో
ఏయుక్తి ఉన్నదో?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి