మాఅబ్బాయికి అప్పుడు 11ఏళ్లు పక్కింట్లో వాడికి ఇద్దరు అన్నదమ్ములు స్నేహితులుండే వారు.
ఒకనాడు వాళ్లింటికి పోయిన మా వాడు, ఆ పిల్లలతోకలిసి ఆదుకోవడంలో మా ఘనుడు కిటికీ ఎక్కి అక్కడిఉండి దూకడంలో వాడికాలు నీటుగా నిల్చోని ఉన్న గాజు సీసా మీద పడిందిఇంకేముంది రక్త ప్రవాహం.
పక్కింటి పిల్లల అమ్మగారు నాకు చెప్తే భయపడతాయని ఆ రక్తమంతా కడిగేసి మా వాడిని కూర్చోబెట్టి అప్పుడు పిలిపించింది నన్ను.
నేను మా వారు వాణ్ణి తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాము. డాక్టర్ గారు వాడిని బల్ల మీద పండబెట్టి కాలు శుభ్రం చేసి కుట్లు వేస్తూ ఉన్నప్పుడు
మా వారు నన్ను చూచి""నువ్వు చూడొద్దు నీ కళ్ళు తిరుగుతాయి.నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు" అంటూ నాకు చెప్టూ చెప్తూ ఆయన వెనక్కి పడిపోయారు కళ్ళు తిరిగి.
డాక్టర్ గారు కుట్లు వేస్తున్నారు కదలడానికి లేదు అప్పుడు అక్కడ ఉన్న పేషెంట్లు మా వారిని తీసుకుపోయి బల్ల మీద పడుకోబెట్టి ముఖం
పైన నీళ్లు చల్లి సేవలు చేశారు
అప్పటి నా పరిస్థితి అయోమయం పిల్లవాడు ఒక వైపు,
మా వారు ఒకవైపు
ఆ స్థితిలో ఉండడం
నేను మానసికంగా
కొంతదృఢత్వం కలిగిన దాన్ని కాబట్టే
తట్టు కొని నిలబడ్డానేమో అనిపిస్తుంది.
అబ్బాయికి కాలుగాయం తగ్గడానికి మూడు నెలలు పట్టింది.
ఎందుకు చెప్తున్నాను అంటే, అటువంటి పరిస్థితుల్లో మనసు
గట్టి చేసుకోవాలి.
లేకపోతే నేను కూడా మా వారిలాగా పడిపోయి ఉంటే మా అందరి పరిస్థితి ఏంటి?
ఆపదలందు ఆత్రుత ఆవేశం కాకుండా, ఆలోచనతో సరైన అవగాహనతో అట్టి పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటాలి.
ఇలాంటివి నా జీవితంలో మరికొన్ని జరిగాయి. కానీ భగవంతునీ దయ వల్ల వాటిని ఎదుర్కొనే శక్తి నాకు ప్రసాదించాడు. చాలా మటుకు అందరిలో ఉంటుంది ఇటువంటి ధైర్యం దానిని ప్రదర్శించటానికి చాలా మంది ప్రయత్నించరు
అందుకే అవసరం వచ్చినప్పుడు ఇటువంటి సంఘటన లను గుర్తు తెచ్చుకొని ధైర్యంగా ఉండడం అందరికీ ఎంతో ఉపయోగకరం
శుభోదయం.
👨🦯 అడుగు ముందుకువెయ్యి. ధైర్యమే నీ ధనము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి