ఏది నీ నిర్ణయం...?
ఎండిన ఆకా..?
పండిన ఫలమా..?
ఏది నీ నిర్ణయం... ?
దహించే నిప్పా..?
ఊరించే వంటకు
రుచినందించే ఉప్పా..?
ఏది నీ నిర్ణయం...?
నిన్ను కాల్చే
నిప్పుల వానా..?
నిన్ను తీరం
చేర్చే నవ్వుల నావా..?
ఏది నీ నిర్ణయం... ?
గ్రంధపు చెక్కా..?
పెరటిలో పెరిగే
పూల మొక్కా..?
వీధిలో చెత్తకుండీలో
విసిరిన అరటి తొక్కా..?
ఏది నీ నిర్ణయం... ?
అబద్ధానికి అర్థమా..?
నిజానికి నిదర్శనమా..?
ఏది నీ నిర్ణయం...?
ఎడారిలో ఎండమావినా..?
దాహం తీర్చే ఒయాసిస్సా..?
ఏది నీ నిర్ణయం...?
ఆకాశానికి చేర్చే నిచ్చెనా..?
అగాధంలోకి జారే ఊబినా..?
ఏది నీ నిర్ణయం...?
చల్లగాలికి కరిగే కురిసే
దాహం తీర్చే నీలిమేఘమా..?
అలసిన మనసుకు కొండంత
ఊరట కలిగించే కోకిల రాగమా..?
గాలిలో ఎగిరే పతంగమా..?
కడలిలో ఎగిసిపడే తరంగమా..?
వినువీధిలో విహరించే విహంగమా..?
ఏది నీ నిర్ణయం తేల్చుకో మిత్రమా...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి