పందెం : సరికొండ శ్రీనివాసరాజు

 సిరిపురం ఉన్నత పాఠశాలకు ఆ ఊరి వారే కాక చుట్టుపక్కల 4, 5 గ్రామాల నుంచి కూడా విద్యార్థులు వస్తారు. పొరుగూరి నుంచి వచ్చే విద్యార్థులు సైకిళ్ళపై వచ్చి పోతారు. ఒక్కోసారి పోటీలు పెట్టుకుని వేగంగా సైకిళ్ళపై వేళ్ళేవారు.
       ఒకరోజు రంగ అనే విద్యార్థి అతి వేగంగా సైకిల్ నడుపుకుంటూ పోయాడు. ఆ తర్వాత రోజు మిత్రులు రంగను మెచ్చుకున్నారు. ఆరోజు సాయంత్రం రంగ తన ఇంటికి పొయే క్రమంలో పక్కన సైకిల్ నడుపుతున్న వాసుతో 'నాతో పోటీ పడి గెలువగలవా?" అంటూ అతి వేగంగా సైకిల్ తొక్కడం మొదలు పెట్టాడు. వాసు కూడా వేగంగా సైకిల్ తొక్కడం ప్రారంభించాడు. కానీ ఏం లాభం? రంగ అందరానంత వేగంగా సైకిల్ నడుపుతూ గెలిచాడు.
       మరునాడు పాఠశాలకు వచ్చిన వాసుతో రంగ "నిన్నటి పోటీలో నిన్ను చిత్తుగా ఓడించాను. నాకు ఏమి గిఫ్ట్ ఇవ్వబోతున్నావు?" అని అన్నాడు. అక్కడ ఉన్న శ్రావణి అనే అమ్మాయి "ఖరీదైన సెల్ ఫోన్ కొనిస్తాడు మా అన్నయ్య. కానీ ఇంకో పందెం. జరగబోయే వార్షిక పరీక్షలలో మార్కులలో మా అన్నయ్యను చిత్తుగా ఓడించాలి. అప్పుడు మరో సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. నువ్వు ఓడిపోతే సైకిల్ పందెం కూడా క్యాన్సిల్. సెల్ ఫోన్ రాదు." అన్నది. ఖంగు తిన్నాడు రంగ. వాసు క్లాస్ ఫస్ట్. తానేమో మొద్దు. ఎలా సాధ్యం అవుతుంది? వాసు మీద కుళ్ళుతో పందెం కాసి వాసు మీద కాసి తీర్చుకోవాలాని అనుకుంటే కథ అడ్డం తిరిగింది. పరువు పోయింది.

కామెంట్‌లు