సుప్రభాత కవిత : - బృంద
పసుపు రాశులు పోసిన 
పసిడి పంట పోలాన 
ప్రతి సుమదళమూ నిరీక్షించే 
ప్రభుని ప్రభాత దర్శనానికై!

పచ్చని రేకులు విచ్చి 
మెచ్చగ సుగంధము పంచి
వెచ్చగా వచ్చు వెలుగుల రేడుకై
ముచ్చటగా వేచె చూపులు పరచి!

కారు మబ్బేదో కాపుకాసి 
దారికడ్డముగ నిలిచేనేమో 
వేరు దారి కనరాక 
కిరణములతో రవి కబురు పంపే!

కలతల నీడలు చుట్టూముట్టినా 
కదలక తప్పదు కాలం 
కమ్మిన చీకటి భయపెట్టినా 
వదలక తప్పదు గ్రహణం

సాగే సమయపు గమనంలో 
సమరాల సావాసమే అయినా
సమస్యలే సహచరులైనా
ఆగక తప్పని పయనమిది...

తప్పక పొడిచే పొద్దునకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు