కథలతో పఠన వికాసం

 కథలు వ్రాయడం వలన విద్యార్థులలో సృజనాత్మకత వికాసం చెందుతుందని,తద్వారా వారిలో పుస్తక పఠన అభిరుచి పెరిగి చదువులో రాణిస్తారని సుగుణ సాహితి సమితి సిద్దిపేట కన్వీనర్ భైతి దుర్గయ్య అన్నారు.బుధవారం అనంత సాగర్ ఉన్నత పాఠశాలలో ఉగాది కథల పోటీ కి కథలు వ్రాసిన 22 మంది విద్యార్థులకు సుగుణ సాహితి సమితి ఆధ్వర్యంలో ప్రశంస పత్రాలు పంపిణీ చేసారు. బాల కథకుల ను ప్రోత్సహించిన  తెలుగు ఉపాధ్యాయులు కోణం పర్షరాములు ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామస్వామి,,ఉపాధ్యాయులు శ్రీదేవి,సమ్మయ్య, కవిత,దుర్గయ్య,పర్ష రాములు లు పాల్గొన్నారు.
కామెంట్‌లు