రెక్కలు
ఉటంకించాలని ఉన్నది
ఊహలలోకంలోనికి తీసుకెళ్ళాలని ఉన్నది
ఉల్లాలను ఉత్సాహపరచాలని ఉన్నది
రెక్కలు
వర్ణించాలని ఉన్నది
గరుడిని గుర్తుకుతేవాలని ఉన్నది
విష్ణుని తలపించచేయాలని ఉన్నది
రెక్కలు
తొడుక్కోవాలని ఉన్నది
పక్షులదగ్గరకు పోవాలని ఉన్నది
స్నేహము చేయాలని ఉన్నది
రెక్కలు
టపటపలాడించాలని ఉన్నది
హృదులు తట్టాలని ఉన్నది
మదులు ముచ్చటపరచాలని ఉన్నది
రెక్కలు
ధరించాలని ఉన్నది
ఆకాశపుటంచుల్ని తాకాలని ఉన్నది
మబ్బులపైనెక్కి తిరగాలని ఉన్నది
రెక్కలు
విప్పాలని ఉన్నది
రివ్వున ఎగరాలని ఉన్నది
పర్వతశిఖరాలు చేరాలని ఉన్నది
రెక్కలు
ఆడించాలని ఉన్నది
డొక్కలు నింపుకోవాలని ఉన్నది
వందేళ్ళు బతకాలని ఉన్నది
రెక్కలు
ముక్కలు చేసుకోవాలని ఉన్నది
డబ్బులు సంపాదించాలని ఉన్నది
కోర్కెలు తీర్చుకోవాలని ఉన్నది
రెక్కలు
కప్పాలని ఉన్నది
వేడినుండి కాపాడాలని ఉన్నది
చలినుండి రక్షించాలని ఉన్నది
రెక్కలు
తెంచుకోవాలని ఉన్నది
నేలపై కూలాలని ఉన్నది
మనుషులతో కలిసుండాలని ఉన్నది
రెక్కలు
ఊపాలని ఉన్నది
గాలిని విసరాలని ఉన్నది
చెమటలు తుడవాలని ఉన్నది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి