*ప్రపంచకవితాదినోత్సవం
🌷💐🌷💐🌷💐 @
స్పందించిన మనసు...భా వోద్వేగానికి లోనయ్యింది !
అనురాగంతో హృదయం
ప్రతిస్పందించి అందమైన అక్షరాలతో మనోహరమైన రూపుదాల్చి...కవితగా
వాసికెక్కినది....!
తొలి నాళ్లలో... ప్రకృతికి ,
ప్రేయసికి మాత్రమే స్పందించిన మనసా...
స్వలాభాపేక్షతో...ఆశ్రయిం చినరాజుల అతిశయోక్తితో వీర, సృ0గార వర్ణనలను మొద లెట్టినావు...!
కేవల పద్యమునకె పరి మిత వై...,
అతి కొద్ది పండిత జన రంజకివై నీ అతిశయ ప్ర దర్శనతో చలాయించితి వె న్నొనాలు...!
"సమాజహితేన సాహిత్యం"
ఈ సత్యమును గ్రహించిన నీవు...యతి , ప్రాసా, గణ, వృత్త ఛందో సంకెళ్లనుద్రె0 చుకుని వచన కవిత గా నూతన రూపు దాల్చి...
అనేకానేక ఉప రూపాలకు విస్తరించి అలరారు చున్న ఓ కవిత్వమా...!
నీ గొప్ప తనము నే నే మని వర్ణింపను....!!
ఎన్నెన్నో ఉద్యమాలకు ఊపిరి వైనావు...!
ప్రేయసీ,ప్రియుల ప్రేమ పర వశమై...విరహానివై వేదించినావు...!
నీ కలమును కత్తిచేసి దుర్మార్గాన్ని దునుమాడినా వు...!
తుపాకీవై తూటాలను పేల్చినావు...!
బా0బుగా పేలినావు...
పిడుగువై పడినావు...!
అన్యాయాన్ని అనేక రూ పాలతో ఎదిరించినావు..!!
ఓ కవిత్వమా...!
నిన్ను అస్పష్టత, సం క్లిష్టతలతో ఇబ్బంది పెట్టినా...
యే వివరణకో, విశ్లేషణ కో, నీ పేరు పెట్టు కున్నా...
ఎవరినీ కాదనవు...
అందరిని ప్రేమతో ఆద రిస్తావు..!
నీవు గేయానివై...గంతులు వేయిస్తావు... గీతానివై ఊయల లూపుతావు...
గజల్ వై ఉత్సాహం రేపు తావు...పాద్యానివై భావమాధుర్యములో మునకలు వేయిస్తావు !
హై కూ , నాని, వంటి ఎన్నె న్నోరూపాలతో శాఖోప శా ఖలుగా విస్త రించే సావు!!
నీ వు సంస్కృతంలోను, ఆంద్రములలోనే కాదు
వ్యావహారిక , ప్రాంతీయ మాండలికాలలోనూ...
అందంగా ఒదిగి పోతావు...!
మనోల్లాసానికి ,విషయ పరిజ్ఞాన , విశ్లేషణలకు...
వివేకాన్ని సాన పెట్టు కునేందుకూ నీవు గొప్పగా సాహకరిస్తావు సుమా..!
సమాజముననే పుట్టి ...
ఈ సమాజ పురోగమన, పురోభివృద్దులకు దోహద పడుతున్న సాహిత్య రూప కవిత్వమా...
నీవు వర్ధిల్లాలి...!
సమాజమా జయహో...
సాహిత్య రూప కవిత్వ మా జయ జయ హో..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి