తిరుమలరావు, సంతోష్ కుమార్ మాస్టార్లకు ప్రశంసాపత్రాలు.


 పాతపొన్నుటూరు యుపి పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు ఆర్ట్ కళింగ ఫౌండేషన్ ప్రశంసాపత్రాలు లభించాయి. కుదమ తిరుమలరావు, బూడిద సంతోష్ కుమార్ లు పంపిన కవితలు ఎంపికైనందున ఈ ప్రశంసాపత్రాలను సాధించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల ఎనిమిదిన అంతర్జాలం ద్వారా నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని, వీరిద్దరూ కవితలు వినిపించారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తొలి జానపద సాంస్కృతిక అకాడమీ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ నేతృత్వంలో కవితా సభ నిర్వహించగా తిరుమలరావు, సంతోష్ కుమార్ పాల్గొని ఈ గౌరవాలను పొందారు. ఆర్ట్ కళింగ ఫౌండేషన్ ఛైర్మన్ పొట్లూరి హరికృష్ణ నేతృత్వంలో, లహరి మహేందర్ గౌడ్ సమన్వయంతో హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని జాతీయ స్థాయిలో అంతర్జాలం ద్వారా నిర్వహించిన "అమ్మ" కవితోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వీరిరువురినీ అభినందిస్తూ వారు ప్రశంసాపత్రాల్ని పంపారు. తిరుమలరావు రచించిన తొలిపలుకు అమ్మ అనే కవిత, సంతోష్ కుమార్ రచించిన సంద్రమంత అభిమానం అమ్మతనం అను కవితలు మాతృమూర్తి సేవలను త్యాగాలను వివరించాయి. తిరుమలరావు, సంతోష్ కుమార్ లకు ఆర్ట్ కళింగ ఫౌండేషన్ ప్రశంసాపత్రాలు లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం, పాతపొన్నుటూరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు,  తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు