కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలకు కీర్తిశేషులు ముస్కు లింగారెడ్డి జ్ఞాపకార్థం అతని కుమారులు బుధవారం విద్యాసామగ్రిని అందజేశారు. 44 మందికి పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు, స్కేళ్ళను ముస్కు మధుకర్ చేతుల మీదుగా పాఠశాల పిల్లలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ఊషన్నపల్లి పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తయారు చేస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులను ప్రారంభిస్తామన్నారు. దాతల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని, పిల్లలకు నాణ్యమైన విద్యను (క్వాలిటీ ఎడ్యుకేషన్) అందిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఊషన్నపల్లి పాఠశాలలో చేర్పించి నాణ్యమైన ఉచిత విద్యతో పాటు సకల సౌకర్యాలు పొందాలని ఈర్ల సమ్మయ్య కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, కొనుకటి శ్రీవాణి, ముసుకు మధుకర్, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.
పాఠశాల పిల్లలకు విద్యాసామగ్రి అందజేత

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి