తెలుగు రాష్ట్రాలలో సులభ లోన్ యాప్ ల హవా యధేచ్చగా సాగుతోంది. తక్కువ వడ్డీ, ఎలాంటి షూరిటీ అవసరం లేకుండా సులభతర విధానం లో క్షణాలలో ఋణాల మంజూరు వంటి కారణాల వలన యువత సులభంగా ఈ యాప్ ల ఉచ్చులో పడిపోతున్నారు. ఇటువంటి యాప్ ల నిర్వాహకులు కాలేజి విద్యార్ధులు, నూతన వధూవరులు మొదలైన వారిని టార్గెట్ చేసుకుంటున్నారు.మొబైల్ ల ద్వారా కనీసం నిబంధనలు, షరతులు చదవకుండా అంగీకారం తెలపడం లో యువత మరీ తొందరపాటు ప్రదర్శిస్తున్నారు.. దీనిని అలుసుగా చేసుకొని, ఋణాలను మంజూరు చేసాక,అసలు వడ్డీ విధానాన్ని బయటకు తీసుకువచ్చి ఒక రూపాయికి నాలుగింతలు వసూలు చేస్తున్నారు. ఒకవేళ వడ్డిని సకాలం లో చెల్లించకపోతే , ఫోన్లు చేసి అసభ్యకర, విచక్షణారహిత సంభాషణలతో మనోవేదనకు గురి చేస్తున్నారు. యాప్ లో ఋణం కోసం రిజిస్ట్రేషన్ చేసే సమయం లో ఆధార కార్డు లేదా పాన్ కార్డు లేదా రేషన్ కార్డు వివరాలతో పాటు ఫొటో ను కూడా అప్ లోడ్ చేయవలసి వుంటుంది. రికవరీ సమయంలో వడ్డీ కట్టడం ఏ మాత్రం ఆలస్యం అయినా రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడడమే కాక మహిళల విషయంలో వారి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి యాప్ నిర్వాహకుల కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారందరికీ పంపిస్తున్నారు. ఇటువంటి వేధింపులకు తట్టుకోలేక కొంతమంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కుడా తెలుగు రాష్త్రాలలో విరివిగా జరుగుతుండడం గమనార్హం.ప్రభుత్వం, మీడియా ఈ సులభతర ఋణాల ఉచ్చులో పడవద్దని ఎంతగా ప్రచారం చేస్తున్నా, పాకెట్ మనీ సులభంగా అంది వస్తుండడంతో కనీసం తల్లిదండ్రులు, బంధువుల సలహా కూడా తీసుకోకపోవడం వలన ఉచ్చులో పడిపోతున్నారు. బ్యాంకు అకౌంటు, ఆధార్ నెంబర్, పాన్ కార్డు నెంబర్లు వంటి వ్యక్తిగత డేటా అంతా యాప్‌ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి.. పిల్లలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక, వేదన భరించలేక, ఒకటికి నాలుగింతలైన అప్పు తీర్చలేక ఒత్తిడిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా రుణ యాప్‌ల దందా యథేచ్ఛగా సాగుతున్నా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు కానరావడం లేదు. గతంలో కాల్ మనీ పేరిట కొన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇటువంటి దోపిడీలకు పాల్పడినా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యింది. వీటి బారిన పడి మరింత మంది మోసపోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మరింత పటిష్టమైన చట్టాలను తీసుకొచ్చి, అమాయకులను దోపిడీ చేస్తున్న అక్రమ రుణ యాప్‌ల నిర్వాహకులను కఠినంగా శిక్షించాలి . ఋణాలను ఇచ్చే మైక్రో ఫైనాన్స్ కంపెనీలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద రిజిస్టర్ అయి వుండాలి లేదా భారతీయ కంపెనీ చట్టం 1956 లోని 5 వ నిబంధన ప్రకారం ప్రభుత్వం నుండి అనుమతి పొంది వుండాలి. దేశంలో ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకున్న ఈ ఋణ యాప్ లు ఎటూవంటి అనుమతులు లేకుండా ఆర్ధిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.ఇటువంటి సంస్థలను నిషేధించడం తో పాటు గూగుల్ ప్లే స్టోర్ వంటి వెబ్ సైట్లలో ఇటువంటి చట్టవిరుద్ధమైన యాప్ లను వెంటనే తొలగించి, తిరిగి రాకుండా ప్లే స్టోర్లు, వెబ్ బ్రౌజర్లపై నిఘా నియంత్రణ వుంచాలి.ఋణ గ్రహీతలు కూడా అన్ని నియమ నిబంధనలు తెలుసుకొని, తీసుకునే ఋణ విధానం పట్ల పూర్తి అవగాహన వచ్చాక రుణాలు తీసుకొవడం మంచిది.
మోసపూరిత లోన్ యాప్ లు:-సి .హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి