కాళిదాసు అమరుడు: - సేకరణ :- అచ్యుతుని రాజ్యశ్రీ

 చావు  ఎవరికైనా ఎప్పటికైనా తప్పదు.మహాకవికాళిదాసు మరణంపై కథనాలున్నాయి. భార్య విద్యోత్తమ ఆయన్నించి ప్రేమ ఆదరణ ఆప్యాయత కోరుకుంది కానీ కవి ఆమెను గురువుగా మాత అమ్మవారిగా భక్తితో గౌరవించేవాడు.అది నచ్చక ఆమె విసిగి శాపం ఇచ్చినది"నాప్రేమను తిరస్కరించావు. ఒక స్త్రీవలన నీకు చావు తప్పదు." అది ఎలా జరిగినదో తెలుసుకుందాం. సింహళ రాకుమారుడు కుమారదాసు కాళిదాసుకి మిత్రుడు. అయితే ఒకసారి రాజ నర్తకి నాట్యం అయిన తర్వాత రాకుమారుడు ఒక శ్లోకాన్ని చెప్తాడు అందులో మొదటి పాదం ఒక కమలం నుంచి ఒక కమలం ఎలా పుడుతుంది నాకు ఈ సమస్యని స్లో క రూపంలో చెప్పితే నీకు మంచి బహుమతి ఇస్తాను అని ప్రకటిస్తాడు ఆమె ఇంటికి వెళ్లి ఎంత ఆలోచించినా దాని అర్థం తెలుసుకోలేక పోతుంది అప్పుడు కాళిదాసు కవి అని గుర్తుకు వచ్చి తన ఇంటికి ఆహ్వానిస్తుంది కాళిదాసుని ఈ శ్లోకం పూరించమని అడుగుతుంది అప్పుడు ఆయన ఓ స్త్రీ నీ కమలం లాంటి మొఖంలో రెండు పద్మాల లాంటి కళ్ళు విరిసాయి ఇది ఆ శ్లోకాన్ని పూర్తిగా చదివితే వచ్చే అర్థం ఇది విన్న తర్వాత ఆ నర్తకి ఒక దుర్బుద్ధి దుర్బుద్ధి పుట్టింది రాజు ఇచ్చే బహుమానం తనే పొందాలి అని ఆశతో కాళిదాసుకి విషం ఇచ్చి ప్రాణం తీస్తుంది రాజు రాజుకి ఆ సమస్యని పూరించి నర్తకి బహుమానం  పొందింది  కాళిదాసు కనపడకపోవడంతో రాజు అనుమానంతో నర్తకిని పిలిచి అడుగుతాడు ఆమె ఇంటిలో కవి మహాకవి శవం కనపడుతుంది సోకంతో కాళిదాసు మృతదేహంతో పాటు రాజు కూడా చితిలో దూకి ప్రాణత్యాగం చేస్తాడు ఈ కథ ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఆ కాలంలో అన్ని ప్రాంతాలలో మహాకవి కాళిదాసు అందరి ప్రేమను చూరగొన్నాడు అన్న మాట మాత్రం సత్యం.ఎంతవారలైనా మృత్యువాత పడకతప్పదు🌹
కామెంట్‌లు