సుప్రభాత కవిత : - బృంద
తిమిరంతో మౌనంగా సమరం 
కదలని కాలంతో పోరాటం 
వదలని తలపులతో యుద్ధం 
చెదరని జ్ఞాపకాలతో పయనం!

రేయి గడచిన మగతలో
వేయి ఆశల వేడుకొలు
మోయలేని బరువు దింపమంటూ
సాయం కోసం ప్రార్థనలు!

వెలుగులో  వెతలను మరపించే
చెలిమి కోసం ఆరాటం 
వేదనలను గెలవనివ్వని 
వేడుకకోసం నిరీక్షణం!

మాపటి కలతలు తొలగి
కమ్మటి కలలు తీరే
రేపన్నది ఉన్నదన్న తలపు
ఎన్నెన్నో  ఆశలు రేపు...

మనసులను కలుపు
మధుర బంధాల చిక్కిన
మమతలకు మరపుంటే
మనుగడ విలువ నిలిచేనా?

వెలితి తీర్చే వేకువకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు