సుప్రభాత కవిత : - బృంద
పసుపు నీళ్ల కళ్ళాపి చల్లి 
పాలమబ్బు రంగవల్లి దిద్దిన నింగి 
మంచు ముత్యాల హారం ధరించి 
మరకతాలు పొదిగిన పట్టు చీర కట్టి
పసిడి కళలు పొంగుతున్న ధరణి 


సన్నగా వీచే  చల్లగాలికి 
చిన్నగా తల ఊపే పంట పైరు 
అలలు సాగే ఏటిలాగా 
హొయలు పోయే నాట్యమాడుతూ..
పల్లె పడుచు  తీరున పరవశిస్తుంటే 

ఎక్కే పొద్దున ఎరుపు మెరుపై 
దిక్కులన్నీ  వెలుగుల వెల్ల వేసి 
మక్కువతో మురిపించగ భానుడు 
చక్కగా కిరణాలు  ప్రసరింపచేసి 
పెక్కు వరాలేవో పుడమికి ప్రసాదించే!

గట్టున నిలిచి చూచే మదిని 
గుట్టుగా అలరించి ఆనందమిచ్చి 
గుట్టగా అనుభూతులు పంచి 
గట్టి ఫలితాలనే ప్రసాదించు 
వెలుగుల వేలుపైన దినమణికి 

వందనములతో 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు