విజయ ఢంకా మ్రోగించు...విశ్వవిజేతవై..!:- కవి రత్న-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
పర్వతశిఖరం చేరాలన్న కుతూహలం...
నిన్ను విశ్వవిజేతగా నిలబెడుతుంది..!

విపత్తుల విషవాయువులు వీచినా...
కోపం, క్రోధం అనే అగ్నికీలలు రేపకు..!

పాము మణిని చూడలేని కర్కశత్వం...
అసూయ, ద్వేషంతో హృదయకాఠిన్యం

నిప్పుకణిల్లా రగిలే కానరాని కక్షలు...
నీ మనసును కాల్చే అగ్నిజ్వాలలు...

మంచి విత్తనాన్ని నాటిన మట్టిలో...
మంచితనం మానవత్వం...
మమకారం మొలకెత్తుతుంది..!

సాధనకు సహనానికి దారిచూపే గాలి...
నిన్ను విజయపథంలో నడిపిస్తుంది..!

చిమ్మచీకటిలో వెలుగును కనలేము...
కుయుక్తులకు కుట్రలకు కుతంత్రాలకు 
దూరంగా సాగిపో..! ప్రశాంతత నీదే...

కలలు కను తప్పు లేదు కానీ
కన్న ఆ కలలు నిజమయ్యేంత
వరకు కనురెప్పలు మూయకు...

కసి కృషి పట్టుదలతో సాధన చేస్తే
సాధ్యం కానిదేముంది...ఈ జగతిలో?
విజయ ఢంకా మోగించేది నీవే...
విశ్వవిజేతవు నీవే...కీర్తికిరీటం నీకే...



కామెంట్‌లు