నిత్యం దీపంలా వెలుగునిచ్చే నువ్వు
కొవ్వొత్తిలా కరిగిపోయే నువ్వు
వంటగదిలో రుచికరమైన సువాసనలు వెదజల్లే నువ్వు
ఆప్యాయతతో కొసరి కొసరి తినిపించే నువ్వు
ఆఫీసులో చక్కగా పనిచేసే నువ్వు
నిత్యం నవ్వులతో ఇంటిలో తిరుగాడే నువ్వు
పండుగల రోజుల్లో ఇంటిని తీర్చిదిద్దే నువ్వు
పిల్లలే ప్రపంచంగా గడిపే నువ్వు
భర్తకు భరోసై చేదోడు వాదోడుగా నిలిచే నువ్వు
భవిష్యత్తుకు బాటలు వేసే నువ్వు
అందరి మన్ననలు పొందే నువ్వు
తలలో నాలుకై మెదిలే నువ్వు
సంసారంలో సంతోషం పంచే నువ్వు
అందరికీ అన్నీ సమకూర్చే నువ్వు
అలసి సొలసినా బాధ్యత మరువని నువ్వు
పొదుపు మదుపు చేసే నువ్వు
ప్రతి ఉదయపు పలకరింపు నువ్వు
ఎంతో ఆరాటపడే నువ్వు
నువ్వే కదా ఆధారం
నువ్వే కదా మమకారం
నువ్వే కదా సహకారం
నువ్వే కదా వంశానికి సూత్రం
నువ్వే కదా సమస్తం
నీతోనే కదా గృహం
నీతోనే కదా కర్తవ్యం
నీతోనే కదా యజ్ఞం
అవును నువ్వే ఇంటికి ప్రాణం
నిజం నువ్వే ముఖ్యం
నువ్వే చెరగని జ్ఞాపకం
నువ్వే నువ్వే నువ్వే.
కొవ్వొత్తిలా కరిగిపోయే నువ్వు
వంటగదిలో రుచికరమైన సువాసనలు వెదజల్లే నువ్వు
ఆప్యాయతతో కొసరి కొసరి తినిపించే నువ్వు
ఆఫీసులో చక్కగా పనిచేసే నువ్వు
నిత్యం నవ్వులతో ఇంటిలో తిరుగాడే నువ్వు
పండుగల రోజుల్లో ఇంటిని తీర్చిదిద్దే నువ్వు
పిల్లలే ప్రపంచంగా గడిపే నువ్వు
భర్తకు భరోసై చేదోడు వాదోడుగా నిలిచే నువ్వు
భవిష్యత్తుకు బాటలు వేసే నువ్వు
అందరి మన్ననలు పొందే నువ్వు
తలలో నాలుకై మెదిలే నువ్వు
సంసారంలో సంతోషం పంచే నువ్వు
అందరికీ అన్నీ సమకూర్చే నువ్వు
అలసి సొలసినా బాధ్యత మరువని నువ్వు
పొదుపు మదుపు చేసే నువ్వు
ప్రతి ఉదయపు పలకరింపు నువ్వు
ఎంతో ఆరాటపడే నువ్వు
నువ్వే కదా ఆధారం
నువ్వే కదా మమకారం
నువ్వే కదా సహకారం
నువ్వే కదా వంశానికి సూత్రం
నువ్వే కదా సమస్తం
నీతోనే కదా గృహం
నీతోనే కదా కర్తవ్యం
నీతోనే కదా యజ్ఞం
అవును నువ్వే ఇంటికి ప్రాణం
నిజం నువ్వే ముఖ్యం
నువ్వే చెరగని జ్ఞాపకం
నువ్వే నువ్వే నువ్వే.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి