"వాసూ! బయటికి వెళ్ళి, 3 ప్లేట్ల మిర్చీ కొనుక్కురా." అన్నది అమ్మ. "అమ్మా! ఇంట్లో చేయవచ్చు కదా!" అన్నాడు వాసు. "అంత ఓపిక ఎవరికి ఉంది. పోనీ నువ్వు చేస్తావా?" అన్నది అమ్మ. మాట్లాడలేదు వాసు. బయటికి వెళ్ళి, మిరపకాయ బజ్జీలు తీసుకు వచ్చాడు. "నువ్వు కూడా తిను." అన్నది అమ్మ. "నేను బయట అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన ఫుడ్స్ తినను. అనారోగ్యం కొని తెచ్చుకోను. నా వాటా వంతు డబ్బులు నాకు ఇవ్వు." అన్నాడు వాసు. "నీ ఖర్మ." అంటూ వాసుకు మిర్చీ డబ్బులతో పాటు వాసుకు ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చింది అమ్మ.
వాసుకు ఇది కొత్తేమీ కాదు. బయటికి వెళ్ళి, మిర్చీలు ఒకసారి, సమోసాలు మరోసారి ఇలా రకరకాల ఫుడ్స్ కొనుక్కు రమ్మన్న ప్రతీసారీ తన వాటా డబ్బులు అడిగి తీసుకునే వాడు.
ఒకసారి వాసు వాసు వాళ్ళ ఇంటికి వాసు చుట్టాల పిల్లలు చాలామంది వచ్చారు. వాసు అమ్మ యథావిధిగా వాసుకు డబ్బులు ఇచ్చి వచ్చిన వారందరికీ మిర్చీ బజ్జీలు తదితరములు తెమ్మన్నది. వాసు తెచ్చాడు. వాసు తప్ప అందరూ తింటున్నారు. "ఏం అన్నయ్యా! నువ్వు ఎందుకు తినవు?" అన్నాడు రాము. అవి ఎంత అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారో సవివరంగా చెప్పాడు వాసు. "మరి అవి తెమ్మన్న ప్రతీసారీ నువ్వు డబ్బులు అడుగుతావట. మరి ఆ డబ్బులతో ఏమి చేస్తావు?" అన్నది వాణి. ఆ డబ్బులతో తరచూ బయట రకరకాల ఫ్రూట్స్ అంటే పళ్ళు కొనుక్కొని తింటాను. డబ్బులతో అనారోగ్యాన్ని కాదు, ఆరోగ్యాన్ని కొనుక్కుంటా." అన్నాడు వాసు. నీ ఆలోచన నాకు బాగా నచ్చింది. నేను కూడా ఫాలో అవుతా." అన్నది సిరి. మిగతా వాళ్ళు తామూ అనుసరిస్తాము అన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి