పుడమితల్లి
పులకించిన వేళ...
ఆమె అడుగులు
నేలను ముద్దాడిన వేళ...
సునీత నవ్వు ఒక నక్షత్ర కాంతి...
ఆమె ఆత్మస్థైర్యం ఒక ఖగోళ గీతం...
ఓ రోదసీ రాణి..!
ఓ అంతరిక్ష ఆణిముత్యమా...
జయహో..! జయహో..!
ఓ సునీతా విలియమ్స్...జయహో..!
నాడు 9 నెలలు...తల్లి గర్భంలో...
9 రోజులు...సముద్ర గర్భంలో...
నేడు 9 నెలలు...ఆకాశ గర్భంలో...
పరిశోధనలు చేసిన ఓ సునీతా...జయహో
గురుత్వాకర్షణ
కట్టి వేసిన సంకెళ్లు తెంచి...
విశ్వాంతరాళంలోవిజయగాథను
లిఖించిన ఓ సునీతా...జయహో...!
విశ్వమంతా తిలకించింది
మీ అంతరిక్ష సాహస యాత్ర...
ఆడుతూ పాడుతూ
భుమి చుట్టూ పరిభ్రమిస్తూ...
16 సూర్యోదయాలు...
16 సూర్యాస్తమయాలు...
తిలకించిన...ఓ సునీతా జయహో..!
4576 సార్లు
భూమిచుట్టూ భ్రమణం...
19.50 కోట్ల కిలోమీటర్ల
వేగవంతమైన నక్షత్ర యానం...
చేసిన ఓ సునీతా... జయహో..!
భూమి తల్లి ఒడిలో
1650 డిగ్రీల వేడిని దాటుకొని...
డాల్ఫిన్ల హర్షధ్వానాల మధ్య...
సురక్షితంగా లాండైన క్రూ డ్రాగెన్"ఫ్రీడం".
9 నెలల ఉత్కంఠకు తెరపడిన వేళ...
140 కోట్లమంది భారతీయులు
భరత నాట్యం చేసిన శుభవేళ...
సీనియర్ వ్యోమగాములు...
సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్.
నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బసేవ్ లు
పుడమి తల్లి ఒడిలో వాలిన వేళ...
"జయహో జయహో "
ఓ వ్యోమగాములారా...
ఓ అంతరిక్ష యాత్రికులారా...
"గ్రాండ్ వెల్ కం టు బ్యాక్ ఆన్ ఎర్త్!"
అంటూ ప్రపంచమంతా వారికి
హర్షధ్వానాలతో ఆహ్వానం పలికింది...
సురక్షిత సుఖమయ ప్రయాణానికి
శుభాకాంక్షలు చెప్పింది...
సునీత అంతరిక్ష విజయరథానికి
సుమస్వాగతం..ఘన స్వాగతం పలికింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి