నేలపై విరిసిన పువ్వుల వన్నెలపై
నింగిని వెలిగే చుక్కలకు మనసై
మబ్బుల పల్లకిలో గిరులపై దిగి
జారివచ్చు జలపాతమల్లే ......
స్వర్గపు జాతరలో దొరికిన
హరివిల్లు రంగుల చీర తెచ్చి
ప్రేమ కానుకగా ధరణికి బహుకరించిన
తరణి కళ్ళలో మురిపమల్లే....
వేగుచుక్క పొడవగానే చూచి
వేగముగా పూలన్నీ వరుసగా పేర్చి
వెలుగుల వేలుపు దారిని
పుడమి పరచిన విరుల తివాచిమల్లే...
నందన వనమును వీడి
నవ్య కళలూరు భువిలో
నవ్వులు పంచగ దివినుండి
దిగివచ్చు సురలోక సుమములల్లే...
ధరను నాకముగా చేయనెంచి
సురులు విరులలో సుధను నింపి
తనివితీరగ జనులు గ్రోలుటకు
అవనికి పంపిన అమృతధారకు మల్లే..
తోచు కుసుమోదయానికి
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి