అలల వాకిళ్ల వెలుగుముగ్గులు
కనుల వాకిళ్ల కలల సుద్దులు
లతల ముంగిట పువ్వుల నవ్వులు
తరువుల తలుపుకు పచ్చని తోరణాలు
గాలి సందళ్ళ సన్నాయి మేళాలు
వాలిన కొమ్మల హాయి నాట్యాలు
గూటిలో గువ్వల కువకువలు
ఘనాపాటి స్వరాన వేదమంత్రాలు
ఏటిని తాకే కాంతి రేఖలకు
నీటిలో చేపల గెంతుల స్వాగతాలు
తొలిపొద్దున గగన కన్య ముఖాన
మెరిసిన రవ్వల ముక్కెర తళుకులు
అద్దాల నీట సొగసు చూసుకొని
దిద్దుకున్న అందాల మెరుగులు.
ఆకాశాన అనుదినము
అలవాటుగా జరిగే అద్భుతం
చూసే కనులకు మనసుంటే
చేసే ఊహల విన్యాసాలు
చెలువైన చెరువున వెలిగే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి