ఎక్కడ్నుంచి వచ్చిందో గాని అందరినీ సరదాగా బేంబేలెత్తించింది ఒక కోతి. అసలే ఆదివారం. మధ్యాహ్నమంతా ఎండంతసేపూ ఇంటి పట్టునే ఉండాలి కనుక ఉదయం పూట షికారులా బయటకొచ్చిన విద్యార్థులకు బలే సందడి కలిగించింది. ఈ సండే గెస్టుగారు అరుగులపై కూర్చుని, పెద్ద మేథావిలా ఆలోచిస్తున్నట్లు గోడలకి ఆనుకుని దర్జాగా కూర్చుని తెగ ఫోజులిచ్చింది.
ఈ అనుకోని అతిథి కోతిమహారాజావారు డాబాలన్నీ దాటుకుంటూ ఊరంతా హల్ చల్ చేస్తూ పిల్లలకు వినోదాన్ని పంచింది. వాళ్ళని ఎగిరి గంతులేసుకునేలా చేసింది. అరటి పళ్ళు మున్నగు తినుబండారాలు దూరంగా ఉంచి పారిపోతుంటే ఆ ఫుడ్డుని ఎంచక్కా మంకీ గారు ఆరగిస్తుంటే బాలబాలికలంతా తెగ సంబరపడ్డారు.
నివగాం ఊరంతా విజిట్ చేసిన సదరు మారుతి గారు ఎక్కువ సమయం కాపువీధిలో గడిపి, ఊరు దాటేసింది. మళ్ళీ ఎప్పుడొస్తావ్ హనుమా అంటూ పిల్లలు ఆహ్లాదంగా టాటా బైబై చెప్పారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి