బాలికలు ఆరోగ్యంగా పెరిగినట్లయితే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారు. చిన్న వయసులో జరిగే వివాహాలు, గర్భ ధారణ వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అమ్మాయికి 18 ఏండ్ల వరకు పెండ్లి చేయకుండా అంటే బాల్య వివాహాలు జరగకుండా చూడటం కూడా సమాజ బాధ్యత. ఇందుకోసం ప్రభుత్వం తో పాటు, స్వచంద సంస్థలు, ఉపాధ్యాయులు, మేధావులు ఇతోధికంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. సమాజంలో నెలకొని ఉన్న కట్నాలు వంటి దురాచారాల వలన తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కనడానికి భయపడుతున్నారు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వడ్లగింజ గొంతులో వేసి చంపేయడం, ఏ ముళ్ళ పొదల్లోనో పారేయడం వంటి అమానవత్వ సంఘటనలకు నేటికీ పాల్పడుతున్నారు. ఇంకా వైద్య శాస్త్రంలోని టెక్నాలజీనీ వాడుకొని కడుపులో ఉన్న బిడ్డ అడా మగా అని తెలుసుకొని అడబిడ్డల్ని చంపేసే వారు ఎందరో ఉన్నారు. ఫలితంగా జీవ సమతుల్యతలో ఆడపిల్లలు తగ్గిపోయి కేవలం మగ పిల్లలు మాత్రమే ఉంటే సమాజంలో సమతుల్యత లోపిస్తుంది.. ఆడపిల్లల పెంపకలు భారం కావటం వల్లనే తల్లిదండ్రులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. కట్న సమస్య, పెళ్ళయ్యాక ఆడపిల్లలపై అత్తింట్లో వేధింపులు వంటివి లేకపోతే తల్లిదండ్రులు ఆనందంగా ఆడపిల్లల్ని పెంచుతారు అనేది సత్యం.
అమ్మాయిలకు చదువుకునే అవకాశం కల్పిస్తే బాల్య వివాహాల శాతం తగ్గుతుంది. కుటుంబంలో కూడా బాలికలు శ్రమ దోపిడీకి గురౌతున్నారు. మగపిల్లలతో పాటు సమానమైన చదువులు, జీతాలు రెండూ లేవు. విద్య, వైద్య సంరక్షణ, రక్షణ, చట్టపరమైన హక్కులు, గృహసింస, బలవంతపు బాల్య వివాహాలు వంటి ఎన్నో రకాల అసమానతలను బాలికలు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో సరియైన మరుగుదొడ్లు లేక మధ్యలోనే చదువుకు మానేస్తున్నారు. రుతుస్రావ సమయాల్లో ఎలాంటి పరిశుభ్రత పాటించాలో తెలియక అనారోగ్యం పాలవుతున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి