రమేశ్ చదువులో బాగా వెనుకబడే వాడు. ఎప్పుడూ ఆటపాటలతో, పనికిమాలిన సహవాస గాళ్ళతో గడుపుతూ విలువైన సమయాన్ని వృథా చేసేవాడు. ఒకరోజు రమేశ్ టీచర్లతో బాగా తిట్లు తిన్నాడు. గణిత ఉపాధ్యాయుడు బాగా దెబ్బలు కొట్టాడు. ఆరోజు లంచ్ టైంలో సురేశ్ అనే విద్యార్థి, "ఒరేయ్ రమేశ్! ఇప్పటి నుంచైనా శ్రద్ధగా చదువు. నీ దుస్థితి మేము చూడలేక పొతున్నాం." అన్నాడు. అప్పుడు రమేశ్ దూరంగా వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
ఆ తరువాత రమేశ్ దూరంగా వెళ్ళి, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. సురేశ్ ఓదార్చాడు. అప్పుడు రమేశ్ ఇలా అన్నాడు. "నాకు జీవితంలో చదువు రాదు అని జాతకం చెప్పేవారు చెప్పారు. నా జాతకమే బాలేదు. నేను ఏం పాపం చేశానో." అన్నాడు. "ఆ జాతకాలు నమ్మవద్దురా! కష్టపడి చదివితే ఖచ్చితంగా నువ్వు తెలివైన విద్యార్థివి అవుతావు." అన్నాడు సురేశ్. "నా జాతకమే బాలేదు. నేనేమీ చేయలేను." అన్నాడు రమేశ్. "నీ ఖర్మ. నిన్ను ఎవరూ మార్చలేరు." అని వెళ్ళిపోయాడు సురేశ్.
విద్యార్థులను విహారయాత్రకు తీసుకు వెళ్తున్నారు. చాలా మంచి చూడదగ్గ ప్రదేశాలకు తీసుకు వెళ్తున్నారు. రమేశ్ ఎంతో ఉత్సాహంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. విహారయాత్రకు ముందు రోజు రమేశ్ ఇంటికి ఒక జ్యొతీష్కుడు వచ్చాడు. అందరి జాతకం చూశాడు. రమేశ్ జాతకం చూసి, వారం రోజులు ఇంట్లోనే ఉంటే మంచిదని, వారం రోజులు బయటికి ఎక్కడికి వెళ్ళినా ప్రాణాలకే ముప్పు అని చెప్పాడు. జ్యొతీష్కుడు వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు వాడిని వారం రోజులు ఇంట్లోనే ఉండమని అన్నారు. "అమ్మా! ఈ జాతకాలు నమ్మవద్దు. అవి నిజం కాదు. జనాలు పొట్ట కూటి కోసం జాతకాలు చెబుతారు. అంతే!" అన్నాడు రమేశ్.
అప్పుడే అక్కడ ప్రత్యక్షం అయిన సురేశ్ "అవును కదా! మరి నీకు చదువు ఎందుకు రావడం లేదు అంటే నా జాతకంలో చదువు రాదు అని చెప్పారు అన్నావు కదా! అప్పుడు ఎలా నమ్మావు?" అన్నాడు. ఖంగు తిన్నాడు రమేశ్. రమేశ్ తల్లిదండ్రులు షాక్! "వీడు చెప్పేది అబద్దం. వీడికి చదువు రాదు అని ఎలా జ్యొతీష్కులు చెప్పలేదు. మిమ్మల్ని మోసం చేయడానికి ఈ అబద్దం చెప్పాడు. సిగ్గులేదురా? నీకు తగిన బుద్ధి చెప్పాలి. ఇకనైనా మేము మేల్కొనకపోతే ఇంతే సంగతులు." అన్నది తల్లి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి