లోయలో ఎక్కడో పుట్టి
కోనలో పలు వంపులు తిరిగి
హోరు చేస్తూ బయలుదేరి
నేల చేరి సేదదీరే సెలయేరు!
మబ్బులకు అద్దమై
శిలలకు నేస్తమై
మిత్రునికి ఆప్తమై
చల్లగా నవ్వే జలన్యాసం!
తన గమనంలో
మన అవసరాలు తీర్చే
ఘనమైన మనసుతో
పయనమయే జీవాధారం!
జీవన పయనంలో
దరి చేరే ఎన్నో స్నేహాలు
మదికి హాయిని ఇచ్చి
కలతలను మరిపించే మరీచికలు!
చిన్ని ఆనందాలే
మిన్న అయే క్షణాలు
కొన్ని అయినా చాలు
చిన్న జీవితంలో....
వద్దకొచ్చే స్నేహాలు
పూర్వ జన్మ పుణ్యాలు
పదిలంగా దాచుకోవాల్సిన
కాలమిచ్చే తాయిలాలు.
అంతరంగము పొందే
అపురూప అనుభూతులు
అడగకనే అంతర్యామి ఇచ్చే
అమూల్య సంపదలు.
కొత్త వెలుగులు పంచే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి