ఎన్నో వింతలు నీ చెంత నుండ కళ్లకు గంతలు కట్టుకొని తిరిగెదవేల మనసా?
నీవు విన్నావా, లేక అన్నావా నూట పదహార్లు అన్నమాట ఎపుడైనా?అదెలా వచ్చెనో చెప్పగలవా ఇప్పుడైనా?
గోదావరి జిల్లా లానాడు
సర్కారు జిల్లాలుగా
పిలవబడెనే తెలుసా నీకు మనసా !
ప్రాంతనికి, ప్రాంతానికి
ఫణ విధానంలో భేదాలు బహు ఖేదాలకు దారితీసేనే
ఒకనాడు ఓ వెర్రి మనసా.
నిజాంలు కవులకు బహుకరిచ్చే నూరురూపాయలు
సర్కారు జిల్లాలలో
తొంబ్భై నాలుగు రూపాయలనే లెక్కగట్టచెప్పేవారు,
ఈ వింత కొంత అచ్చెరువు గదవే మనసా !
ఈ లెక్క చెప్పగాఆచ్చరువున, కవులకు గొప్పగా
నైజాము ప్రభువులు
నూట పదహారులిచ్చి
రాజమండ్రివారియొక్క నూటికి సమము చేసిన విధము వినవే ఇప్పుడైనా మనసా.ఆ ముచ్చటే నాటినుండి
"నూట పదహార్లు "ఏ బహుమతికైనా జోడించి "వేయి నూట
పదహార్లు" .ఇత్యాదిగా
చెప్పడం ఒక గొప్ప
సాంప్రదాయమైనదే మనసా.ఇట్టివెన్నో కలవు రెలిసికొనుము
పెద్దలు చెప్పేటి మాటలు శ్రద్ధగా
వినుకుంటే జ్ఞానమ్ము పెరుగ,ఆజ్ఞానమ్ము తరుగు.తలూపి తప్పుకోకేమనసా!
సామెతలు మనకు మంచి ఆమెతలుగదా
.చిన్న వాక్యమ్ములో
సర్వ సత్యమ్ములిముడు.
జాతీయములు మన తెలుగు జాతి జీవన విధాన నావకు తెరచాపగా దారిచూపు.
తియ్యని తెలుగు పలుకులు ఒలికించు
గాంధర్వ గాన రసము.
వాక్యములు గావవి
తెనుఁగు సంగీత శారద చేతి కచ్చపి పై నొలికించుసంగీత చెరుకు రసము.
అట్టి తెలుగు నాట ఉగాది వధూటీ
సుందర విశ్వావసుగా ప్రభలుమీర మనఇంట పాదముమోపుచున్నది
మోదము మీరగా.
మంగళ వాద్యములతోడ
ఎదురేగి నియ్యరే
రంగైన హారతులను.
పూర్వ బాధల గాధలను,పోకార్చుమని వేడుకొనరే.ఆర్చినా తీర్చినా ఆయమ్మే దిక్కు మనకు.
పండుకానిపండు చింతపండు, పువ్వుకాని పువ్వు
వేపపువ్వు.కలిసిన
కమ్మని షడ్రుచుల ఉగాది పచ్చడి వెండి గిన్నెలోన అర్పించరే
అమ్మకు ప్రీతితోడ.స్వాగతమ్మని పలికి తోడ్కొని వచ్చెదము రారే తెలుగు దేశమునకు
విశ్వావసు ఉగాది శుభాకాంక్షలతో, సి వసుంధర
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి