నేనేమన్నా కలగన్నానా?:- Dr. C. వసుంధర
 పూవులు పిలిచి నట్లుండే
చిగురాకులు చిరు నవ్వులు
చిందించి నట్లుండే
సుమ గంధమ్ము
నను తాకినట్టుండే
రసాల సాల శాఖపై పికము కూసినట్టుండే
శుక మొక దిశ
స్వరమేత్తి రామ నామ
ముచ్చరించి నట్లుండే 
ముచ్చటగా మయూరి
పించము. విప్పినట్లుండే.ఉండే నదేమో!నేడేమి సుదినమో నా సదనపు ముంగిట 
మూగినవి ముగ్ధ మనోహర        దృశ్యములు.ఈ నిరుపేద మీద ఎంత దయో దశరదరామయ్యకు దయసేయునేమో?
అనుచు కలియుగ శబరి యొకతి
కన్నులు
తెరిచి పరికించి పక్కున నవ్వుకొనుచు
నేను కమ్మని కలగంటి
 ననుచు చెప్పే ప్రక్కింటి పడతి తోడ.     
కలలు కనే కళ్ళు ఆనందానికి పుట్టిల్లు.అనుభవానికి
ఆనవాళ్లు. మనసుకు వాకిళ్ళు.

కామెంట్‌లు