బుద్ది బలము:- N.అక్షయ్,-7A తరగతి,-TGTWURJC(B)ఇబ్రహీంపట్నం,-రంగారెడ్డి జిల్లా,-తెలంగాణ.
 అనగనగా ఒక అడవి ఉండేది .ఆ అడవి ప్రక్కన రెండు గ్రామాలు ఉండేవి. ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి వెళ్ళాలన్నా, ఆ గ్రామం నుంచి ఈ గ్రామానికి రావాలన్నా ఆ అడవి దాటి పోవాలి. ఆ అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు అడవి దాటి ఎవ్వరిని వెళ్ళనిచ్చేవాడు కాదు. ఒకవేళ వెళ్ళాలనా ఒక ఆట ఆడి వెళ్ళాలి. ఒక రోజు ఇద్దరు స్నేహితులు ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్తారు. అప్పుడు ఆ రాక్షసుడు ఇలా అంటాడు. "మీరు ఆట ఆడుతారా?" అప్పుడు వాళ్ళు ఆడుతామని అంటారు. రాక్షసుడు ఇలా అంటాడు. "మీరు గెలిస్తే మిమల్ని వెళ్ళనిస్తాను. ఒకవేళ మీరు గెలవకపోతే "మిమ్మల్ని చంపేస్తాను" ఇద్దరిలో ఒకరిని గుహ లోపలికి తీసుకెళ్ళి ఆడిపిస్తాడు ఆడిపించేముందు ఆ రాక్షసుడు ఇలా అంటాడు. ఈ ఆటలో రెండు కాగితాలు ఉంటాయి. ఆ రెండిటిలో ఒక దానిలో ఆవు చిత్రము, ఒక దానిలో గాడిద చిత్రము, ఉంటుంది. ఒక వేళ నువ్వు ఆవు చిత్రము తీస్తే నిన్ను నేను వదిలేస్తాను. ఒక వేళ నువ్వు గాడిద చిత్రాన్ని తీస్తే నిన్ను నేను చంపేస్తాను అని అంటాడు. సరే అని "ఆ పిల్లవాడు అంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఆ రెండు కాగితాలను చూపించి ఈ కాగితమా లేకపోతే ఈ కాగితమా అని అడుగుతాడు. ఆ పిల్లవాడు ఒక కాగితాన్ని పట్టుకుంటాడు. దానిని విప్పిచూస్తే దానితో గాడిద చిత్రము ఉంటుంది. ఆ రాక్షసుడు ఆ పిల్లవాడిని చంపివేస్తాడు. ఆ రాక్షసుడు సరిగ్గా ఈ పిల్లవాడిని ఎలా చంపేస్తాడో బయట ఉన్న పిల్లవాడిని కూడా అలానే చంపేస్తాడు. ఇలా చాలా మంది వచ్చి చచ్చిపోతారు. ఒక రోజు వేరే దేశం నుంచి ఒక పిల్లవాడు వస్తాడు. ఆ పిల్లవాడు కూడా ఆ ఆట ఆడాలని అనుకుంటాడు. ఆ ఆట గురించి గ్రామం వాళ్ళని అడుగుతాడు అడిగిన తరువాత ఆ గుహ దగ్గరికి వెళ్ళి అక్కడినుంచి దొంగచాటుగా చూస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు రెండు కాగితాలతో గాడిద చిత్రాన్ని పెడుతుంటాడు. అది చూసి ఆ పిల్లవాడు ఇలా గ్రామ ప్రజలనంతా మోసం చేస్తున్నాడు.ఎలాగైనా గెలవాలని చిత్రాన్ని దొంగచాటుగా తీసుకెళ్ళి రాక్షసుడితో ఇలా అంటాడు.నేను ఈ ఆటను ఆడతానని అంటాడు. అప్పుడు రాక్షసుడు ఆ పిల్లవాడికి ఆట గురించి చెప్తాడు.అప్పుడు ఆ పిల్లవాడు తెచ్చిన ఆవు చిత్రాన్ని చేతిలో పెట్టుకుంటాడు.అప్పుడు ఆ పిల్లవాడు ఒక కాగితాన్ని కాళ్ళ కింద పెట్టుకొని తను తెచ్చిన కాగితాన్ని దానిలో కలిపేస్తాడు.కలిపేసిన తరువాత తను తెచ్చిన కాగితాన్ని విప్పిచూస్తాడు. దానిలో ఆవు చిత్రము ఉంటుంది. అప్పుడు ఆ పిల్లవాడు  రాక్షసుడితో ఇలా అంటాడు. ఇప్పుడు నన్ను ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి వెళ్ళనివ్వు. ఇంక నువ్వు ఇక్కడినుంచి వెళ్ళకపోతే నేను నువ్వు చేస్తున్న నాటకం అందరికి చెప్తాను అంటాడు.అప్పుడు ఆ రాక్షసుడు భయంతో ఆ 
అడవినుంచి వెళ్ళిపోతాడు.

నీతి :- కండ బలము కంటే బుద్ధి బలము మిన్న.


+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 శిక్షణ&పర్యవేక్షకురాలు
డా౹౹దుగ్గి గాయత్రి రంగరాజు,
పి.జి.టి.తెలుగు.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Good story 👍