"మనుషులకి బుద్ధి చెప్పిన ఏలియన్స్":- పెద్ద గొల్ల రోహిత్,- ఏడవ తరగతి,- జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాల దౌల్తాబాద్.- జిల్లా:- సిద్దిపేట.. Ph.9912097556
    అది ఒక టైటాన్ గ్రహం. భూమికి చాలా దూరంలో ఉండేది. ఆ గ్రహం మీద కొన్ని గ్రహాంతరవాసులు (ఏలియన్స్) ఉండేవి. ఆ గ్రహం పైన చెట్లు,నీరు, చెరువులు లేవు.
    ఒకసారి అవి ఎగిరే పళ్ళాల లాంటి మిషెన్ ద్వారా మన భూమి పైకి వచ్చాయి. ఇక్కడి పచ్చటి చెట్లు,చల్లని గాలి, తియ్యని నీరు చూసి "ఆహా!ఎంత బాగుందో కదా ఈ భూగ్రహం" అని ముచ్చటపడి, ఎంతో అదృష్టవంతులు ఇక్కడి మనుషులు అనుకొని కొన్ని రోజులు ఇక్కడే సేదదీరి మళ్ళీ తమ గ్రహానికి వెళ్లాయి. 
      ఇక్కడ మన భూగ్రహం లో ఉన్న మనుషులు పచ్చటి చెట్లని నరికేసి, చెరువులను పూడ్చేసి, పెద్ద పెద్ద భవనాలు కట్టి, చెరువులనీ ప్లాస్టిక్ వ్యర్ధాలతో నింపి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. దాంతో కాలుష్యం పెరిగిపోతుంది. ప్రజలకి రకరకాల రోగాలు వస్తున్నాయి. 
      కొన్ని రోజులకు ఏలియన్స్ మళ్లీ భూగ్రహం పైకి వచ్చాయి. కానీ అప్పటిలాంటి వాతావరణం లేదు. ఇక్కడి మనుషులు చెట్లు, చెరువులు, వాతావరణం అన్ని కలుషితం చేశారు. ఇదంతా చూసిన ఏలియన్స్ కి చాల కోపం వచ్చింది. వాటి దగ్గర ఉన్న శక్తితో మనుషులందరినీ గాలిలోకి లేపి మనుషులకి అర్థం అయ్యే భాషలో ఇలా చెబుతున్నాయి.
"ఓరి దుర్మార్గుల్లారా! ఇంత మంచి భూగ్రహాన్ని నాశనం చేసుకుంటున్నారు కదరా!!పచ్చటి చెట్లని నరికేయాలని, మంచి చెరువులను కలుషితం చేయాలని మీకు ఎలా అనిపించింది? మీరు తీసుకునే గాలి ఆ చెట్ల నుండే వస్తుంది. మీరు దాహంతో అల్లాడిపోతే తాగడానికి నీటిని అందించే చెరువులను ప్లాస్టిక్ వ్యర్ధాలతో నింపి ఎలా కలుషితం చేయాలని అనిపించింది? మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు"అని ఏలియన్స్ మనుషులకి బుద్ధి చెప్పాయి. 
      దాంతో మనుషులందరూ తాము చేసిన తప్పుని అర్థం చేసుకొని సిగ్గుపడ్డారు. అప్పటినుండి భూమ్మీద ఉన్న అందరూ చెట్లని కొట్టడం మాని, మొక్కలను పెంచడం, చెరువులను బాగు చేసుకోవడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం మొదలుపెట్టారు. దాంతో భూమిపైన వాతావరణ కాలుష్యం తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. మన గ్రహం వారు కాకపోయినప్పటికీ మనుషుల కళ్ళను తెరిపించిన ఏలియన్స్ కి కృతజ్ఞతలు తెలిపారు....
          


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Very good rohith nice story
Keep it up