పుస్తక ప్రపంచం26 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 ఏనాటికీ అద్భుత సైన్స్ ఫిక్షన్ రచయిత హెచ్.జి.వెల్స్ విశ్వసాహిత్యంలో అజరామరుడు. ది వార్ ఆఫ్ ది వరల్డ్స్ 1898 లో వెలుగులోకి వచ్చిన నవల.మార్స్ నుంచి ఏలియన్స్ ఇంగ్లాండ్ లో దిగి కన్పడ్డప్రతిదీ నాశనం చేస్తారు.వేడిగా మండిపడే కిరణాలే వారి ఆయుధాలు.మానవజాతి సంక్షోభం , ఏలియన్స్ దాడులను బ్రహ్మాండంగా వర్ణించిన హెచ్.జి.వెల్స్ రవిగాంచనిచో కవిగాంచును అన్న మాటను నిజం చేశాడు.సైన్స్ ఫిక్షన్ రచనలకి బీజంవేసి 21వ శతాబ్ది స్థితిగతులను అంచనావేసిన బ్రహ్మ!20వశతాబ్దిలో వచ్చిన జర్మన్ క్లాసిక్*ది మెటామార్ఫసిస్*1915 లో  ప్రచురింపబడింది.రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. ప్రయాణాలు చేసే సేల్స్ మాన్  ఓపురుగు గా మారడం ,మనిషిసైజులో సంచరించటం దీని కథ. చిన్న ఫిక్షన్ గా గుర్తింపుపొందిన ఇది కాలేజీ యూనివర్శిటీలలో బోధింపబడుతోంది."ది ఇంటర్ ప్రెటేషన్ ఆఫ్ డ్రీమ్స్" సిగ్మండ్ ఫ్రాయిడ్ రచన.ఆయన ఫాదర్ ఆఫ్ సైకో ఎనాలసిస్ గా ప్రశంసలందాడు.సైకాలజీ ఆఫ్ డ్రీమ్స్ వివరణ తో నేటికీ చిరస్మరణీయుడు🌹
కామెంట్‌లు