బాదుషాలు :- జక్కుల శరణ్య -6వ, తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల సిద్ధిపేట జిల్లా -9704865816
 ఒక అడవిలో నెమలి,జిరాఫీ కలిసిమెలిసి ఉండేవి.ఒకరోజు నెమలి జిరాఫీతో ఇలా అంది "మనం ఇద్దరం మన అడవిలోని స్నేహితులందరికీ విందు ఏర్పాటు చేద్దాం" అని అనుకున్నాయి.అంతలో అక్కడికి కోతి,ఎలుగుబంటి, ఏనుగు,ఒంటె,ఎలుక మిగతా జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి.విందు విషయం తెలుసుకొని అన్ని జంతువులు చాలా సంతోషించాయి."మనమందరం ఇలా విందు ఏర్పాటు చేసుకోవడం చాలా సరదాగా ఉంటుంది"అని ఏనుగు అన్నది."అప్పుడు తలా ఓ పని చేసుకొని వంటలు తయారుచేసి ఆనందంగానే గడుపుదాం" అని జంతువులు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాయి.ఒకపక్క ఏనుగు అన్నం వండుతుంది. మరోపక్క సింహం పాలకూర పప్పు వండుతుంది.ఇంకో పక్క ఒంటెకు సహాయకారిగా ఎలుక ఉండి ఘుమఘుమలాడే పప్పుచారు తయారుచేస్తుంది.ఇంకా నక్క కుందేలు కలిసి మజ్జిగ మంచిగా తయారు చేస్తున్నాయి.ఎలుగుబంటి జిరాఫీ చక్కగా కారపూస, బూంది తయారు చేస్తున్నాయి.ఇక అన్ని జంతువులు వంటలు తయారు చేశాయి.అంతలో కోతి"అరే మనం అన్ని వంటలు చేశాము కానీ ఇందులో అసలు తీపి వంటకమే లేదే అని అంది.అప్పుడు అన్ని  జంతువులు అది నిజమే అన్నాయి.అన్ని కారం వంటకాలే చేశాం
అనుకున్నాయి.అప్పుడు నెమలి అయితే మనం ఒక స్వీట్ చేద్దాం అని చెప్పింది. కొంగ ఇలా అన్నది"వరుకోలు లక్ష్మయ్య సారుకు ఇష్టమైన బాదుషాలు చేద్దాం" అంది. వెంటనే అన్ని జంతువులు సంతోషించాయి.చక్కర,మైదా, నెయ్యి,కలిపి బాదుషాలు తయారు చేయడం మొదలుపెట్టాయి.ఆ వాసనకు చీమకు నోటిలో నీళ్లూరుతున్నాయి.ఎందుకంటే చీమకు స్వీట్ అంటే చాలా ఇష్టం.వీళ్ళు నాకు ఇష్టమైన వంటకం చేస్తున్నారని చీమ సంతోషించింది.అందులో అందరూ కాళ్లు చేతులు కడుక్కొని విందుకు కూర్చున్నాయి.ఇక విందు మొదలుపెట్టాయి.ఆ విందుకు  పాలపిట్ట"లక్ష్మయ్య సార్ గారిని తోలుకొని వచ్చింది." సార్ గారు ఆ విందు మధ్యలో కూర్చొని హాయిగా జంతువులతో పాటు విందుభోజనం చేశాడు.చివరికి బాదుషాలు తిని ఎక్కడి వారక్కడకు వెళ్లిపోయారు.

కామెంట్‌లు