గుహ్యా ద్గుహ్య తమం సారం గురు గీతా విశేషతః
తవ ప్రసాదా చ్ఛ్రోతవ్యా తాం సర్వాం బ్రూహి సూత నః 5
ఇతి సంప్రార్థితః సూతో ముని సంఘైః ముహుర్ముహుః
కుతూహలేన మహతా ప్రోవాచ మథురం వచః
బాబాను తన జీవిత రధ సారధిగా చేసుకొని,సర్వశ్య సరణాగతి ఒనరించిన వారికి తప్పక న్యాయం జరుగుతుంది.ఒకసారి గుహడా అనే గ్రామం లో పౌరోహిత్యం చేసుకునే ఒక బ్రాహ్మణుడిని ఆ గ్రామ తగాదాలలో అనవసరంగా ఇరికించి , హత్య చేసాడన్న అభియోగాన్ని మోపారు. పోలీసులు అతనిని అరెస్ట్ చెసి జైలులో పడేసారు. హత్యా నేరానికి మరణ శిక్ష తప్పదని న్యాయవాదులు అన్నారు.ఆ పేద బ్రాహ్మణుడు ఏ పాపమూ ఎరుగడు. నిత్యం దైవరాధన చేయడం తప్ప అతనికి ఇంకొక పని తెలియదు. భగవంతుడినే తన జీవిత నౌకకు రధ సారధిగా చేసుకొని నిత్యం నామ స్మరణ చేస్తుండేవాడు. నారు పోసిన వాడు నీరు పొయ్యడా అన్న చందాన జన్మ నిచ్చిన తన సర్వేశ్వరుడే తనకు తిండీ గూడూ ఇచ్చి తన సర్వ బాధ్యతలను చూస్తాడన్న పఠిష్టమైన విశ్వాసంతో జీవన యాత్ర చేస్తున్నాడు.ఆ బ్రాహ్మణుడి స్నేహితుడైన ఒక ముస్లిం మిత్రుల సలహా పై పరుగు పరుగున శిరిడీ వెళ్ళి తన శ్నేహితుడిని రక్షించమని శ్రీ సాయిని కన్నీరు మున్నీరుగా ప్రార్ధించాడు.అతని ప్రార్ధనకు కరిపోయిన శ్రీ సాయి “ అల్ల అచ్చా కరేగా !” అని ఆశీర్వదించారు.
తదుపరి వారం లో పూర్తి స్థాయి విచారణ జరిగి ఆ పేద బ్రాహ్మణుడిని అనవసరం గా ఇరికించారని గ్రహించి కోర్టు తక్షణమే ఆ బ్రాహ్మణుడిని విడుదల చేసింది.సద్గురువు కృప వలన చివరకు న్యాయమే గెలిచింది.
శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం -6:- --సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి