మేలిమి చింత ఆవిష్కరణ :- ప్రమోద్ ఆవంచ - 7013272452


 నా రెండవ కవితా సంపుటి మేలిమి చింత ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది.పన్నెండు మంది అతిరధ మహారధులైన వ్యక్తులు ఆశీర్వాదాల వర్షాన్ని నాపై కురిపించారు.ప్రముఖ కవి యాకూబ్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్ వేణుగోపాల్, హాజరు కాగా,నల్గొండ జిల్లా ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి నా కవితా సంపుటిని ఆవిష్కరించి,ప్రధమ ప్రతిని ప్రీతి యూరాలజి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ వద్ది చంద్ర మోహన్ గారికి అందించారు.వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్ వేణుగోపాల్ గారి రైటింగ్స్,జ్ఞానం,విజ్ఞానం,విజ్ఞత....... వీటన్నింటికి నేను పెద్ద అభిమానిని.కవి సంగమం ద్వారానే నేను ఇంతో అంతో రాయగలుగుతున్నాను.దానికి కారణం కవి యాకూబ్ గారు.జర్నలిజంలో నన్ను ప్రభావితం చేసిన ఇద్దరు వ్యక్తులైన తిరునగరి వేదాంత సూరి,కాసుల ప్రతాపరెడ్డి గార్లు పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసారు.కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ కవులు గులాబీల మల్లారెడ్డి, కందుకూరి అంజయ్య, గాజోజు నాగభూషణం గార్లు తమ మాటలు పాటలతో ఆహ్వానితులను మంత్ర ముగ్ధులను చేసారు.ప్రముఖ రచయిత, అనువాదకులు,రూప్ కుమార్ డబ్బీకార్, ప్రముఖ కవి చల్లా రామ ఫణి గార్లు నా పుస్తకం లోని కవితలను విశ్లేషించారు.నాకు పితృ సమానులు, ఆత్మీయులు, పాలకుర్తి కృష్ణమూర్తి గారు నన్ను ఆశీర్వదించారు.పాలపిట్ట సాహిత్య మాసపత్రిక సంపాదకులు, పాలపిట్ట బుక్స్ పబ్లిషర్ గుడిపాటి వెంకట్ 
గారు నా పుస్తకాన్ని చాలా అద్భుతంగా ప్రచురించారు.
అంతే అద్భుతంగా భావనా గ్రాఫిక్స్ బ్రహ్మం గారు నా పుస్తకం కవర్ పేజీనీ డిజైన్ చేశారు.కార్యక్రమం
మొదట్లో ఇటీవల స్వర్గస్తురాలైన మా పెద్దక్క ఆవంచ మంజులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆమెకు ఆత్మకు  శాంతి కలగాలని ఆహ్వానితులందరూ ప్రార్ధించారు.కార్యక్రమానికి మా చిన్నక్క ఆవంచ మాధవి సంకలనకర్తగా వ్యవహరించి ముఖ్య అతిథులను, ఆత్మీయ అతిథులను స్టేజీ మీదకు ఆహ్వానించింది.ఈ కార్యక్రమానికి ప్రీతి యూరాలజి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ రూప మేడం రావడం విశేషం.మా బావ నెల్లుట్ల వెంకటరామచందర్ రావు గారు,మామయ్య అత్యుతరామారావు గారు,కమల్ గారు,మా అన్నయ్య న్యాయవాది ఆవంచ క్రాంతి కుమార్,నా చిన్న కూతురు శృతిక,మా ఇతర బంధువులు, స్నేహితులు,
తదితరులు పాల్గొన్నారు.
 పుస్తకాలు కొని చదివే పరిస్థితులు కరువైపోతున్న ఈ రోజుల్లో ప్రీతి యూరాలజి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ చంద్ర మోహన్ గారు నా మేలిమి చింత కవితా సంపుటి వంద పుస్తకాలను కొనుగోలుచేయడం  నాకు, ఆశ్చర్యంతో కూడిన ఆనందం కళ్ళను తడి చేసింది.సాహిత్యాన్ని ప్రోత్సాహించాలన్న ఆయన సంకల్పం, వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్ధం అవుతుంది.ఆయన ఇల్లు కళలకు, కళాకారులకు నిలయం కావడమే అందుకు కారణం అయి ఉండవచ్చు.చంద్రమోహన్ సార్ సహచరి ప్రీతి యూరాలజి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ రూప మేడం మంచి క్లాసికల్ సింగర్.సార్ కూతురు కూచిపూడి నృత్యం నేర్చుకుంది.కుమారుడు మంచి ఆర్టిస్ట్.బొమ్మలు బాగా వేస్తాడు...ఇలా ఇంట్లో అందరూ కళాకారులే.సాహిత్యాన్ని ప్రోత్సాహించిన డాక్టర్ చంద్ర మోహన్ గారికి నా నమస్సులు.
                                ప్రముఖ కవి గాయకుడు గాజోజు నాగభూషణం గారు నా కవితా సంపుటిలోని కవితల లైన్లను ఒకచోట చేర్చి పాటగా రాసి అద్భుతంగా ఆలపించారు.ఇలాంటి ప్రక్రియను ఇదివరకు ఎవ్వరూ 
చేసి ఉండరు.తన మధురమైన గానంతో ఆహ్వానితులను 
ఆకట్టుకున్నారు.
                        చివరిగా ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలి.
అతను పాలపిట్ట నరేష్ ,నా పుస్తక ఆవిష్కరణ పనులన్నీ 
తన భుజాల మీద వేసుకుని బ్యానర్ నుంచి మొదలు పెడితే బుక్స్,టీ, బిస్కెట్,సమోసాలను, అందరికీ అందేలా చేసాడు.చాలా కష్ట పడ్డాడు.
                          మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఇంత 
విజయవంతం చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను...💐💐🙏🙏
                                   
కామెంట్‌లు