శ్రీ గురు గీత లోని 9 , 10 వ శ్లోకాలు :
వ్యాఘ్రాజినే సమాసీనం శుకాది ముని వందితం
బోధయంతం పరం తత్వం మధ్యే ముని గణే క్వచిత్ 9
ప్రణమ్ర వదనా శశ్వన్నమస్కుర్వంత మాదరాత్
దృష్ట్వా విస్మయ మాపన్న పార్వతీ పరిపృచ్ఛతి 10
ఒకసారి బాపూసాహెబ్ జోగ్ తన స్నేహితునికి పదిహేను వందలు అప్పు ఇచ్చాడు. ఇద్దరూ అప్పు తాలూకు వివరాలను స్టాంపు పేపరుపై రాసుకున్నారు. ఆర్ధిక పరమైన కష్టాలలో వున్నందున ఆ స్నేహితుడు గడువు లోపల అప్పు తీర్చలేకపోయాడు. అప్పుడు జోగ్ ఆగ్రహం తో నిప్పులు చెరుగుతూ ఆ స్నేహితునిపై దావా వేయడానికి సిద్ధమై సాయి అనుమతి కోసం మశీదుకు వెళ్లడు. శ్రీ సాయి అతనిని శాంతపరుస్తూ “భావూ, నీ డబ్బు ఎక్కడికీ పోదు, నువ్వు ప్రశాంతంగా ధ్యానం చేసుకో” అని అన్నారు.
"అదేమిటి బాబా అలా అంటారు. నేను దావా వేయనిదే ఒక్క పైస కూడా మిగిల్చేలా లేడు వాడు. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు, కష్టాలలో వున్నడని ఇస్తే ఇలా ఎగగొడతాడనుకోలేదు” అంటూ అసహనం ప్రదర్శించాడు జోగ్.
జోగ్ ఎంత బ్రతిమిలాడినా శిరిడీ విడిచి పోవడానికి అతనికి శ్రీ సాయి పర్మిషన్ ఇవ్వలేదు. కొంతకాలం తర్వాత జోగ్ స్నేహితుడు డబ్బు మొత్తం తీసుకువచ్చి ఇవ్వగా వడ్దీ కూడా ఇస్తే గాని తీసుకోనని జోగ్ మంకు పట్టు పట్టాడు.ఈ తంతు జరుగుతుండగా శ్రీ సాయి జోగ్ కు కబురు పెట్టారు. మసీదుకు వచ్చిన జోగ్ కు కమ్మగా చీవాట్లు పెట్టారు ” అత్యవసరమైతే తప్ప ఎదుటి వరి నుండి వడ్డి తొ తీసుకోవడం మహా పాపం.అందువలన నువ్వు ఆచరించిన ధర్మమంతా వ్యర్ధమైపోతుంది.ఎదుటివారు కష్టాలలో వున్నప్పుడు ఇతోధికంగా సాయం చేయడం మానవులు కనీస ధర్మం. పూర్వ జన్మ కర్మ వలన అతను కష్టాల కడలిలో కూరుకుపోయాడు అందువలన నీ డబ్బును తిరిగివ్వడం కాస్త ఆలస్యమయ్యింది అంతమాత్రాన అతనిని వడ్డీ అంటూ పీడించుకు తినడం తప్పు”
బాబా మాటలకు జోగ్ కు జ్ఞానోదయమయ్యింది. తన స్నేహితుని నుండి అసలు మాత్రమె తీసుకొని పంపేసాడు. రాదనుకున్న దబ్బును వచ్చేలా చేసిన శ్రీ సాయి దేవునికి ఆ డబ్బు అంతా సమర్పించాడు కాని సాయి కొద్దిగా దక్షిణగా స్వీకరించి మిగితాది అతనికి తిరిగి ఇచ్చేసారు.
భగవంతుడు దయతో ప్రసాదించిన ధనమును చక్రవడ్డీ అంటూ వడ్డీలకు తిప్పుతూ, సమ్యానికి కట్టని బడుగులపై కొరదా ఝులిపించి వారిని జలగల వలే పీక్కు తినే నేటి వడ్దీ వ్యాపారస్థులకు ఈ లీల ఒక కనువిప్పు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి