మెప్పు:- ఎం.వెంకట సుప్రజ, 8వ తరగతి,-జి.ప.ఉ.పా. నర్సింహులపల్లి,-పెద్దపల్లి జిల్లా.
 వెళ్ళాలి వెళ్ళాలి
బడికి చక్కగా వెళ్ళాలి
అ, ఆ.. లు, గుణితాలు రాసి
తెలుగు చక్కగా నేర్వాలి
ఎ,బి,సి,డి.. లనే దిద్ది
ఇంగ్లీష్ చక్కగా చదువాలి
ఒకటి, రెండు... అంకెలతో
లెక్కలు చక్కగా చేయాలి
సామాన్య శాస్త్రం నేర్చి
బొమ్మలు చక్కగా వేయాలి
సాంఘిక శాస్త్రం చదివి
చరిత్రను చక్కగా తెలుసుకోవాలి
దేశ భాష హిందీని నేర్చి
కలిసిమెలిసి ఉండాలి
అన్ని చక్కగా చదువాలి
అందరి మెప్పు పొందాలి..


కామెంట్‌లు