ఎడ్ల బండి (ఖచ్చురం): - అంకారపు రవి(బ్రహ్మస్):- ఫోన్:-9000663838

 అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు (వృషభపురం) ఆ ఊరి దారిలో ఉన్న రెండు కొండల పేర్లు భవన గిరి- వృషభ గిరి ఆ ఊరికి వెళ్లే దారిలో ఈ రెండు కొండల మధ్య దారి ఉంటుంది
ఆ కొండల మధ్యలో దారిలో ఉన్న ఊరే (వృషభపురం)...
 ఈ వృషభపురం గ్రామంలో అనేక పాడి పశు సంపద అధికంగా ఉండడం వల్ల ఈ ఊరికి... (వృషభ పురం) అని పేరు వచ్చింది. 
వృషభపురంలో తంగేడు కిట్టయ్య అనే రైతు ఉండేవాడు అతనికి 5 ఐదు ఎకరాల పొలం ఉంది అందులో రెండు ఎద్దులాతో దుక్కి దున్ని పొలాన్ని నాటు చేసుకునేవాడు....
అలా నాటు చేస్తూ తన ఎద్దులను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు...
వాటికి పేర్లు కూడా పెట్టాడు బసవన్న రంగన్న ఎడ్ల పేర్లు పెట్టాడు...
అలా కొంతకాలంగా తన పొలాన్ని సాగు చేస్తూ ఎడ్లు తనను ఎంతో ఆప్యాయతగా ప్రేమగా చూసుకునేవాడు....
తన వ్యవసాయాన్ని అత్యధికంగా పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ తంగేడు కిష్టయ్య కొంచెం కొంచెం అభివృద్ధి చెందసాగాడు...
అయితే ఒకనాడు వృషభపురంలో తాను పండించిన ధాన్యాన్ని పక్కన ఉన్న పట్టణానికి తరలించడానికి (ఎడ్ల బండి) కర్చురం ...
కట్టి రంగన్న బసవన్నను ఎడ్లను పట్టణానికి ధాన్యం అమ్మడానికి బయలుదేరాడూ...
దాన్ని బస్తాలన్నీ ఎడ్ల బండిపై వేసుకొని పట్టణానికి బయలుదేరి అక్కడ దాన్ని రైస్ మిల్లులకు అమ్ముదామని బయలుతూ ఉన్నాడు అలా వృషభపురం రెండు కొండలు మధ్య భావనగిరి వృషభగిరి దాటి వెళ్ళసాగాడు అలా వెళ్తూ వెళ్తూ కొంత దూరం వెళ్ళాక తన పశువులైనటువంటి ఎడ్లకు కొంచెం దాహం వేసింది ఇంతలో బసవన్న తాను తెచ్చుకున్నటువంటి సద్ది మూట తిందామని చెట్టు కింద ఆగి అనుకున్నాడు అంతలో కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద రావి చెట్టు కనిపించింది అంత దూరం వెళ్లి ఆ చెట్టు కింద ఎడ్ల బండిని ఆపి తన హెడ్ లైనటువంటి బసవన్న , రంగన్న ఎడ్లను ఆపి వాటికి దాహం తీర్చడానికి పక్కనున్న చెరువులో దాహం తీర్చుదామని అనుకున్నాడు... తంగేడు కిట్టయ్య 
ఇంతలో కచ్చురం దిగి ఎడ్ల బండి దిగి....
కిట్టయ్య ఎడ్ల తాడును విప్పి.... పక్కనున్న చెరువులోకి తీసుకెళ్లి పశువుల దాహం తీర్చుదామని చూశాడు.....
ఇందులో పశువుల చెరువు దగ్గరికి తీసుకెళ్లి దాహం తీర్చి తాను తెచ్చుకున్నటువంటి సద్దిని ఆ చెట్టు కింద ఆవకాయ ,పెరుగఅన్నం, తిందామని సద్దిమూట విప్ప సాగాడు... తంగేడు కిట్టయ్య
 ఇంతలో అటువైపు వస్తున్న ఒక బిచ్చగాడిని చూశాడు ఆ బిచ్చగాడు ఆకలి అంటూ తన దగ్గరికి వచ్చి దేహి అని చేతులు చాచాడు అప్పుడు తంగేడు కిట్టయ్య చూస్తూ ఓకే కూర్చో నేను ఒకరి కోసమే తెచ్చిన సద్ది మూట కొంచెం ఇందులో నీకు కూడా పెడతాలే అని ఆ పక్కనున్న మోతుకు ఆకులను తెంపుకొచ్చుకో అని చెప్పాడు ఆ బిచ్చగాడు సరైన అయ్య బాంచన్ అని.....

మోత్కు ఆకులను తెచ్చుకున్నాడు...
అందులో తంగేడు కిట్టయ్య తాను తెచ్చుకున్న సద్దిమూటలో కొంచెం పెరుగన్నం ఆవకాయ తీసి ఆ బిచ్చగాడికి పెట్టాడు ...
ఆ బిచ్చగాడు గత రెండు రోజుల నుండి అన్నం లేక అలమటిస్తూ పట్టణం నుంచి పల్లెకు బయలుదేరాలని అనుకున్నాడు....
కానీ ఆ బిచ్చగాడు పట్టణం కంటే పల్లె ముద్దు అని పల్లెల్లో ఉన్న ప్రజలు కాస్త అన్నమోకూర వేస్తారని కానీ పట్టణంలో తాను చస్తున్నా గానీ పట్టించుకోని వ్యవస్థ పట్టణంలో ఉందని ఆ బిచ్చగాడు తంగేడు కిట్టయ్యతో వివరించాడు...

కానీ తంగేడు కిట్టయ్య అవునులే....!
పల్లె తల్లి వంటిది పట్టణం ప్రియురాలు వంటిది అని తంగేడు కిట్టయ్య ఆ బిచ్చగానికి వివరించాడు...

అయ్యా మీరు ఈ ధాన్యం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఎడ్ల బండి తోని అని అడిగాడు బిచ్చగాడు కిట్టయ్యని....!
ఏం లేదయ్యా పక్కన ఉన్న పట్టణంలో రైస్ మిల్లులో నా ధాన్యాన్ని అమ్మడానికి వెళ్తున్నాను...!
నేను అమ్మే దాన్యం కొంచెం ఎక్కువ రేటు వచ్చే అవకాశం ఉందని అక్కడికి వెళ్తున్నాను అయ్యా అని కిట్టయ్య ఆ బిచ్చగానికి చెప్పాడు...!

అప్పుడు ఆ బిచ్చగాడు అయ్యా ఈమధ్య రైతులకు గాని వ్యవసాయదారుల గాని పండించిన పంటకి గిట్టుబాటు లేక చేసిన వ్యవసాయం అప్పులతో కోరుకొని పండించిన పంట చేతికందగా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయ్యా అని చెప్పాడు...
అప్పుడు తంగేడు కిట్టయ్య ఇలా అంటుంటాడు అవునా నువ్వు అన్నది మాత్రమే కానీ మనం చేసే పని పదిమందికి అన్నం పెట్టే రైతన్నగా అన్నదాత గా ఉంటున్నామే తప్ప మనకు సరైన గిట్టుబాటు ధర ప్రభుత్వాలే గాని ప్రజలే గాని మనల్ని గుర్తించడం లేదయ్యా అని కిట్టయ్య ఆ బిచ్చగాడికి చెప్తాడు....!
అప్పుడు ఆ బిచ్చగాడు అయ్యా నేను పక్కనే ఉన్న ఊరిలో నేను ఒకప్పుడు రైతు నేనుఅయ్యా పండించిన ధాన్యం...!
చేతికందక అప్పులతో కుప్పలుగా చేరి ఉన్న పొలం అమ్ముకొని భార్య చనిపోయి.....! నా పిల్లలు నన్ను పట్టించుకోకుండా నేను బిచ్చగాడిగా మారానయ్య అని.....!

ఆ బిచ్చగాడు తంగేడు కిట్టయ్యకు వివరిస్తాడు...
ఓ అలాగా అనీ... కిట్టయ్య ఓకే నేను నా పొలంలో నీకు పని ఇప్పిస్తాను నువ్వు పని చేస్తావా? వృషభపురంలో అని అడుగుతాడు ఆ బిచ్చగాడిని...!

సరే బాబు గారిని మీరు చెప్పిన విధంగా నేను పని చేస్తాను మీకు పాలేరుగా పని చేస్తాను ఏ పని చేసి చెప్తే ఆ పని వ్యవసాయం నేను చేస్తాను అని ఆ బిచ్చగాడు కిట్టయ్యకు వివరిస్తాడు....!

అయితే ఇప్పుడు నేను పట్టణానికి బయలుదేరుతున్నాను ధాన్యాన్ని రైస్ మిల్ లో అమ్మేసి వద్దాం పదా అని అంటాడు కిట్టయ్య ఆ బిచ్చగాడికి సరేనయ్యా నా కడుపుకి అన్నం పెట్టి నాకు పని ఇచ్చావు అయ్యా నీకు ఎప్పుడు రుణపడి ఉంటా నాకు ఇంత అన్నం పెట్టి నాకు కొంచెం పని చేస్తే చాలయ్య బాంచన్ అని కిట్టయ్యతో ఆ బిచ్చగాడు బ్రతిమిలాడుతూ చెబుతాడు....!
అలా తంగేడు గిట్టయ్యాను ఆ బిచ్చగాడు అనుకుంటున్నాను అయితే కొద్దిగా సేపు ఆ రావి చెట్టు కింద నేను సేద తీర్చుకుంటానని తంగేడు కిట్టయ్య ఆ బిచ్చగాడితో చెప్తాడు...

అయ్యగారు మీరు నిద్రపోండి నేను ఇక్కడ పశువులకు చెరువులో నీళ్లు మీరు పట్టారు కదా నేను అలా పచ్చడి గడ్డి కోసుకొచ్చే ఆ పశువులకు గాసం వేస్తాను అని ఆ బిచ్చగాడు చెప్తాడు....!
అలా ఆ బిచ్చగాడు పక్కనున్న గడ్డిని కొడవలితో గాసం కోయడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఇంతలో కిట్టయ్య చెట్టు కింద ఓ దుప్పటి వేసుకొని నిద్ర పోదామని  పడుకుంటున్నాడూ కిట్టయ్య....!


బిచ్చగాడు పక్కనున్న గడ్డిని కొడాలితో కోస్తూ ఉండసాగాడు అలా కొద్దిసేపు కోసి రంగన్న బసవన్న ఎద్దులకు పశుగ్రాసం కింద వేద్దామని ఆ బిచ్చగాడు వచ్చాడు ఇంతలో....!
తంగేడు కిట్టయ్య కాలి దగ్గరికి నల్లని నాగుపాము తన దగ్గరికి రావడం చూసిన బిచ్చగాడు...!
అయ్యబాబోయ్ పాము ... బాంచను అయ్యగారు పాము అని గట్టిగా కేకలు వేయడం సాగుతాడు బిచ్చగాడు...!
ఇంతలో చుట్టుకున్న తెలివైన వెంటనే లేచి కూర్చుంటాడు ఇంతలో తన దగ్గరికి వచ్చినటువంటి పాము పడగ విప్పి ఉన్నది....!
దాని దగ్గర నుండి తప్పించుకొనడానికి తంగేడు కిట్టయ్య మెల్లగా కదులుతూ ఒకేసారి సర్రుమని పక్కకు మేదిలాడు తంగేడు కిట్టయ్య...!


అప్పుడు ఆ పడగ విప్పిన పాము నుండి తప్పించుకున్నాడు తంగేడు కిట్టయ్య అలా తప్పించుకున్న తంగేడు కిట్టయ్య అరచేతిలో ప్రాణం పెట్టుకొని హమ్మయ్య ఈరోజు లెచిన ఘడియ మంచిదయింది ఈ బిచ్చగాడు...!
కాస్త అన్నం బెట్టుట్ల నన్ను ఆదుకున్నాడు అంతేకాకుండా ఇక్కడ ఈరోజు నా ప్రాణాలు పోయేటివి అని అనుకొని.....!
ఆ బిచ్చగాడి రుణం ఈ విధంగా తీసుకోవడానికి అయినా నేను వెనుకాడను అని నాకు వ్యవసాయంలో తాను చేదోడు వాదోడుగా ఉంటాడని అనుకుంటూ తనకు ఒక చిన్న ఉద్యోగం ఇద్దామని నిర్ణయించుకుంటాడు....!

అప్పుడు ఆ పాము తిరిగి వెళ్ళిపోతుంది ఆ రావి చెట్టు ఉన్న పక్కలో పొదల్లోకి వెళ్లిపోసాగింది....!
ఇంతలో తంగేడు కిట్టయ్య రంగన్న బసవన్న ఎద్దులను పశుగ్రాసం వేసాక ఎద్దులు విశ్రాంతి పొందాక అక్కడ నుంచి బిచ్చగాడును కిట్టయ్య ఇద్దరు పట్టణానికి వెళ్తారు అక్కడ ఉన్న రైస్ మిల్లు తన ధాన్యాన్ని అమ్మే వేయడానికి వెళ్ళసాగారు.....!

పట్టణంలోని ఒక పెద్ద రైస్ మిల్ లోకి వెళ్లారు అందులో తన ధాన్యాన్ని అమ్మడానికి ప్రయత్నించడానికి ఒక షావుకారిని చూశారు.....

ఆ షావుకారు పేరు  బజలాల్.....!
ఈ  బజాలాల్ చాలా పిసినారి.....!
ఒక పైసా కూడా ధాన్యానికి ఎక్కువ రేటు కట్టించడు.....! ఇతను ఒక పెద్ద దళారి అని చెప్పవచ్చు....!
వ్యవసాయదారుల రైతన్నల రక్తం పీడించే ఒక జలగల బర్జిలాల్ అని చెప్పవచ్చు....!

తంగేడు కిట్టయ్య ఆ  బజలల్ దగ్గరికి వెళ్ళాడు...
షావుకారు నమస్కారమండి ...!
నా పేరు తంగేడు కిట్టయ్య నేను ఒక వ్యవసాయదారుని రైతన్నని మేము వృషభపురం నుండి వస్తున్నాము...!
మా యొక్క ధాన్యాన్ని మీ యొక్క రైస్ మిల్లులో అమ్మడానికి మీ దగ్గరికి వచ్చాము అని తంగేడు కిట్టయ్య బజ్లాల్ గారిని చెబుతాడు....!

సరేనయ్యా అని బజ్ లాల్ గారు.....!
ఎన్ని బస్తాలు పండించారు ఎన్ని కింటల్లో ఉన్నాయి చెప్పు కింటలకు ఎంత రేట్ ఇవ్వమంటావు అని కిట్టాయ్యను అడుగుతాడు బజ్లాల్...?

అయ్యా షావుకారు కింటల్ కు 2200 రూపాయలు...
ఇవ్వండి అని తంగేడు కిట్టయ్య....!
బజ్ లాల్ గారికి షావుకారికి వివరిస్తారు...

అప్పుడు బజ్ లాల్ ఇలా అంటూ....!
లేదయ్యా అంత ధర  ఎక్కడుంది...!
కేవలం 1500 రూపాయలు మాత్రమే ధాన్యానికి ఉంది అని వివరిస్తాడు బజ్లల్....!

అప్పుడు కిట్టయ్య ఏందయ్యా  షావుకారు పల్లె నుండి పట్టణానికి ఇంత దూరం ఎక్కువ ధర వస్తదని మేము ఇంత ఎండలో ఎడ్ల బండి పై ధాన్యం తీసుకొని వస్తే మీరేమో ధర లేదంటారు అని సమాధానం ఇస్తాడు కిట్టయ్య....!

అప్పుడు బజీలల్ .....!
లేదయ్యా ఇదే ఎక్కువ మీకు అని దళారీగా మాటలు మాట్లాడుతూ ధాన్యాన్ని దోచుకుందామని కిట్టయ్య దగ్గరి నుండి బాజీ లాల్ ఎదురుచూస్తాడు.....!

అయ్యా షావుకారు మీరు పెద్దలు మేము నిద్రలేని రాత్రులు చూస్తూ పంట పొలాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఎండనక, వాననక , రేయనక, రెప్పనక, కంటికి రెప్పలా కాపాడుతూ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాము అలాంటి మా అన్నదాత రైతన్నలకు సరైన గిట్టుబాటు ధర లేక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కొందరు ప్రైవేటు వ్యక్తులు దళారి మాటలతో మాలాంటి రైతు బిడ్డలను.... కొందరు దోచుకుంటున్నారు..!
కాబట్టి మా రైతులను మీరు మరోలా చూడకండి షావుకారు గారు ..... అని తంగేడు కిట్టయ్య వివరిస్తాడు....!

కానీ బాజీ లాల్ తనలో ఒక మూర్ఖత్వంతో పిసినారి తత్వంతో ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఎంతో మంది రైతులను మోసం చేసి తాను రైస్ మిల్లు వ్యాపారిగా ధనవంతుడిగా వ్యాపారం చేస్తూ ఎదిగాడు కాబట్టి తంగేడు కిట్టయ్యను  కూడా మోసం చేయాలని చూస్తాడు సరైన గిట్టుబాటు ఇవ్వకుండా తనకు తక్కువ ధర కట్టి ఇద్దామని బాజీలాల్ తన మనస్సులో అనుకుంటుంటాడు...!

కిట్టయ్య ఇలాఅంటూ.....!
అయ్యా షావుకారు గారు... మీరు దయచేసి మా రైతన్నలకు న్యాయం చేసే ధరను ఇవ్వండి అని బాజీ లాల్ కిట్టయ్య బ్రతిమిలాడుతూ కోరుతాడు...
అప్పుడు బాజీలాల్ లేదయ్యా బాబు ఉన్నా ధాన్యం మేము రైస్ మిల్ గోదాంలో పురుగులు పడుతున్నాయి కాబట్టి నీ ధాన్యాన్ని కొని మేమేం చేసుకుంటాం అయ్యా.... అంటూ బాజిలాల్ కిట్టయ్యను ఎదురు ప్రశ్నిస్తూ తక్కువ ధరకే కొనుకోవాలని బాజిలాల్ తన మనసులో అనుకుంటూ కిట్టయ్య ధాన్యాన్ని తాను సొంతం చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడు....,!

అప్పుడు కిట్టయ్య చేసేదేమీ లేక సరేనయ్యా షావుకారు గారు మీరు మరో 400 రూపాయలు ఎక్కువగా ఇప్పించండి ... అని కిట్టయ్య 
బాజీ లాల్ ని కోరడం జరుగుతుంది....?

కానీ బాజీలాల్ లేదు లేదు......!
కేవలం 1600 రూపాయలు మాత్రమే ఇస్తాను నువ్వు ఎందుకంటే అంత దూరం నుండి వృషభపురం ఊరు నుండి వచ్చావు కాబట్టి నీకు అదనంగా 100 రూపాయలు ఎక్కువ కట్టిస్తాలే ఏం బాధపడకు అని బాజీలాల్ ఉన్న ధాన్యాన్ని తన సొంతం చేసుకుంటాడు.....!

అప్పుడు చేసేదేమీ లేక రైతన్న అయినటువంటి తంగేడు కిట్టయ్య....!
బాధపడుతూ ఇ న్నేళ్లు పండించిన పంట...!
తక్కువ ధరకు ఇస్తున్నానని బాధపడుతూ ఎడ్ల బండి లో ఉన్న వరి ధాన్యాన్ని బాజీ లాల్ రైస్ మిల్ కు అమ్మేస్తాడు....!

అప్పుడు బాజీలాల్ క్వింటలకు 1600 రూపాయలు కట్టించి తంగేడు కిట్టయ్యమోసం చేస్తాడు....!

అప్పటికే సాయంత్రం 7:00 అవుతుంది ఉదయం బయలుదేరిన కిట్టయ్య పట్టణానికి వచ్చేసరికి సాయంత్రమైంది కానీ ఇంటికి తిరిగి వెళ్దామంటే....
రాత్రి దొంగల భయం ఉంది... వరి ధాన్యం అమ్మిన డబ్బులు దొంగలు దోచుకుంటారని భయంతో ఆరోజు ఆ రైస్ మిల్ దగ్గర్లోని పడుకొని తెల్లారి వెళ్దాం లే అని అనుకున్నాడు కిట్టయ్య....!

వరి ధాన్యాన్ని పక్కనున్న హోటల్లో బిచ్చగాడు కిట్టయ్య ఇద్దరు కలిసి రాత్రి భోజనం చేసి ఎద్దులకు రంగన్న, బసవన్నలకు కాస్త కొంచెం పశుగ్రాసం వేసి రైస్ మిల్లులో  అక్కడే ఉన్న రైతుల రైతుల  విశ్రాంతి గదిలో బిచ్చగాడు తంగేడు కిట్టయ్య ఇద్దరు నిద్రపోయే సాగారు.....

ఇంతలో రాత్రి ఒంటిగంట అవుతుంది.....?
ఆ రైస్ మిల్ నుండి పెద్ద శబ్దంతో అగ్ని మంటలు చెలరేగాయి.....!
అక్కడ ఉన్న తంగేడు కిట్టయ్య బిచ్చగాడు మరియు కొందరు రైతులు భయపడసాగారు....!

ఏంటిది ఆ రైస్ మిల్లు ఇంత పెద్దగా అగ్ని మంటలు  చిల్లరేగుతున్నాయని అక్కడ ఉన్న కొందరు విశ్రాంతి తీసుకున్న రైతులందరూ.....!
రైస్ మిల్ దగ్గరికి పరిగెత్తడం సాగారు అక్కడ మంటల్లో వరి ధాన్యం కాలిపోతున్నాయి....

ఈ విషయం తెలుసుకున్న రైతులు కొందరు ఫైర్ ఇంజన్ కు కాల్ చేయడం.....
రైస్ మిల్ వ్యాపారి అయినా బాజీ లాల్ వారి ఉద్యోగులు ఫోన్ చేయడం.....!
ద్వారా అక్కడ ఉన్న రైతులందరూ కొంత ధాన్యం వరకు కాపాడడం జరిగినది....


కానీ బాజీలల్ వచ్చేసరికి కొంత దాన్యం నష్టపోయినది..... రైస్ మిల్ పాడైపోయి అగ్ని ప్రమాదానికి గురైనది....!
ఆ ప్రమాదం అంతా అక్కడ ఉన్న షార్ట్ సర్క్యూట్ ద్వారా వంటలు చేలరేగీ..... ఉన్న రైస్ మిల్లు దాన్నేమంతా కాలిపోయింది కాబట్టి కొంతవరకు రైతులు కాపాడారు కాబట్టి బాజీలాల్ కృంగి బాధపడుతూ రైతులకు అన్యాయం చేశానని అందువల్లనే నాకు ఇలాంటి పరీక్ష దేవుడు విధించాలని బాధపడుతూ ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు చేయకూడదని రైతులను తన కంటికి రెప్పలా చూసుకోవాలని వారికి సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలని బాజీలాల్ తన మనసులో బాధపడుతూ ఉన్నాడు.....!

అప్పుడు తంగేడు కిట్టయ్య బాజీలాల్ దగ్గరికి వచ్చి షావుకారు గారు మేము ఈరోజు ఎక్కడ ఉండేప్పటికే రైతన్నలందరం కొంతవరకు మీ రైస్ మిల్లు కాపాడగలిగా కాబట్టి మేము పండించే పంట డైలీ మేము కాపాడుతూ ఉంటాం అలాంటి పంటగా వరి ధాన్యానికి మీరు సరైన గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుంది కానీ మీ స్వార్థ ప్రయోజనాలకు దళారీ వ్యవస్థగా దళారు లుగా

వ్యవహరించకండి దయచేసి ఇలాంటి పనులు చేయకండి అని తంగేడు కిట్టయ్య....
బాజీ లాల్ గారితో అంటాడు....!

అప్పుడు బాజి లాల్ కు బుద్ధి వచ్చిందని....
నేను మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పు చేయనని...

బాజీ లాల్ ఏడుస్తూ ఇలాంటి పనులు మళ్లీ ఎప్పుడు అన్నదాత అయినటువంటి రైతన్నను మోసం చేయను అని నేను రైతన్నకు వెన్నెముకలాగా ఎప్పుడు ఉంటానని రైతులందరికీ మాటిస్తాడు.....

అలా రాత్రి జరిగిన  అగ్ని ప్రమాదానికి..
రైస్ మిల్లు లో ప్రమాదం వల్ల కొంత కరబు అయినా వరి ధాన్యం.... మీ తప్ప ఎక్కువ నష్టం కలగకుండా రైతులందరూ కాపాడారు కాబట్టి బాజిలాల్ బతికిపోయాడు...

అయితే మరునాడు ఉదయం తిరుగు ప్రయాణమైన అటువంటి...
తంగేడు కిట్టయ్య మరియు బిచ్చగాడు ఎడ్ల బండి కచ్చురం పై వృషభ పురానికి బయలుదేరుతాడు...!

అలా తన ఇంటికి వచ్చిన తంగేడు కిట్టయ్యతో బిచ్చగాడు వచ్చాడు కాబట్టి తాను పండించే ఐదు ఎకరాల వ్యవసాయాన్ని కి కూలీల బిచ్చగాడు తన దగ్గరే ఉంటూ హాయిగా వారు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు....!

వ్యాపారస్తుడు అయినటువంటి బాజిలాల్ తంగేడు కిట్టయ్య ను మోసం చేద్దామనుకున్నాడు కానీ తానే బూడిద పాలయ్యాడు అనే సంగతి తనకు అర్థమైపోయింది కాబట్టి....!

అప్పటినుండి బాజీలాల్...
ఏ ఒక్క రైతును గాని మోసం చేయడానికి వీలు లేకుండా చూస్తూ సరైన వ్యాపారం చేస్తూ చాలా రైస్ మిల్లును బాగు చేసుకుని మళ్లీ పునః ప్రారంభించి అందరి రైతులకు అందుబాటులో ఉన్న అందరికీ సరైన గిట్టుబాటు ధర అందిస్తూ కొనసాగుతాడు......

మిత్రులందరికీ చిన్న విన్నపం భారతదేశంలో ఎక్కువగా రైతన్నలైనటువంటి అన్నదాతలకు జరుగుతున్న వివక్షత రైస్ మిల్లుల వ్యాపారుల దళారుల వ్యవస్థను గూర్చి రాయడానికి ఈ స్టోరీ రాయడం జరిగింది.....
===================================================================
                        
                        అంకారపు రవి(బ్రహ్మస్):-  ఫోన్:-9000663838
                        H-no-6-82
                        గ్రా/మం:- తంగళ్ళపల్లి 
                        జిల్లా:- రాజన్న సిరిసిల్ల 
                        ఫోన్:-9000663838


కామెంట్‌లు