రామయ్య పెళ్లిలో భోజనాలు ఉండవు....???:- 'వాజ్ఞ్మయ భూషణ' '' కావ్యసుధ '' 9247313488- హైదరాబాదు
 చిన్నారి పాపల్లారా ...!
చిరు చిరు దివ్వల్లారా....!!
రామయ్య పెళ్లిలో భోజనాలు ఉండవు... ఎందుకో తెలుసుకోండి...?
     శ్రీరామనవమి అనగానే శ్రీరాముడి జన్మదినమే కాకుండా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరిపించడం ఆచారం. మిగతా పండుగల కంటే శ్రీరామనవమి భిన్నమైన పండుగ.మిగతా పండుగలు వివిధ రకాలైన భక్ష్య భోజ్యాలతో  వంటలు చేసి నైవేద్యం సమర్పించి భుజిస్తే, శ్రీరామనవమి నాడు కేవలం బెల్లం పానకం, పెసర పప్పుతో చేసిన వడపప్పు నైవేద్యంగా సమర్పించడం, ఈ ఆచారాలను,విధి  విధానాలను లోతుగా పరిశీలిస్తే అనేక అంశాలు అర్ధమవుతాయి. 
    శ్రీరామనవమి వేసవి కాలంలో వచ్చే పండుగ, ఎండ ఉధృతికి శరీరం నిర్వీర్యం అవుతుంది. శక్తి తగ్గిపోతుంది. దాహం ఎక్కువగా ఉండటం వలన నీరు అధికంగా స్వీకరించడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. జీర్ణశక్తి సరిగ్గా జరగదు. చెమట అధికంగా పడుతుంది ఫలితంగా శరీరంలోనిపొటాషియం, సోడియం వంటి లక్షణాలు తక్కువ అవుతాయి. ఇటువంటి వాటి నుండి రక్షించడమే బెల్లం పానకం స్వీకరిస్తే శరీరంలో వేడి తగ్గిపోయి, చల్లదనం ఏర్పడుతుంది. చల్లదనంతో పాటు బెల్లం ఆకలిని కూడా కలిగిస్తుంది. ఇక పెసరపప్పు కూడా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. వేడి నుంచి తాపాన్ని తగ్గించేందుకు వాటిని తట్టుకునే శక్తి కోసం చలువచేసే పదార్థాలను స్వీకరించడం ఆచారమైంది. 
 పెసలు బుధ గ్రహానికి, బెల్లం గురు గ్రహానికి సంబంధించినవి వీటిని తీసుకోవడం వలన ఆ గ్రహాల ప్రభావం ప్రసరించి బుద్ధి వికాసం ,మానసిక వికాసం కలుగుతాయని శాస్త్రోక్తి.

కామెంట్‌లు