మనిషి- మనీషి.:- డా పివిఎల్ సుబ్బారావు..విజయనగరం-9441058797.
 1.
నవమి నాడు జన్మించిన, మచ్చలేని పున్నమి చంద్రుడు! 
సూర్యవంశమణిదీపకుడు, అనంతయశోప్రభాకరుడు! 
సరి దారి నడిచి, నరజాతిని, నడిపించిన నరోత్తముడు! 
ఆ నామస్మరణ ఒక్కటేచాలు, ఇహపరదాయకుడు! 
రామఅయనం, జననయనం, ఘనపయనం మార్గదర్శకుడు!
2.
జంతూనాం,
         నరజన్మ దుర్లభం!
రామానుసరణం, శరణం,
         నరజన్మ సార్థకం!
కలియుగం బాలుర ,
   ఆదర్శం రామచరితం! 
ప్రతి బాలుడు రాముడే,
   కావాలి జనకామితం! 
ప్రజాస్వామ్యం,
 శ్రేయోరాజ్యం సంభవం!
3.
మా నవ వ్యక్తిత్వ వికాసం,  
       షోడశగుణ శోబితం!
షోడశగుణ ఆచరణస్ఫూర్తి,,
త్రికాలాలలో,త్రిలోకాలలో, శ్రీరామచంద్రమూర్తి!
జీవితమంతా ధర్మజ్ఞుడు, సాటిలేని వీర్యవంతుడు!
సద్గుణాభరణ శోభితుడు, ఉడుతకు సైతం కృతజ్ఞుడు! 
నిత్యసత్య భాషణుడు, కష్టసుఖాల దృఢసంకల్పుడు! 
4.
అన్నివేళలా శీలవంతుడు అనన్య సమస్తభూతహితుడు!
సకల విద్యాపారంగతుడు, ‌
సరిసమస్యసాధనాసమర్ధుడు!
జగాన జనప్రియదర్శనుడు, కష్టాలకుంగనిధైర్యవంతుడు!
సాధారణంగా  జితక్రోధుడు,
కోపం తెచ్చుకుంటే రుద్రుడే! 
తేజస్సులకి తేజస్సు ,లేని, వాడంటే అసూయే లేనివాడు!
5.
అవతార పురుషుడు, మానవజాతికి ఆరాధ్యుడు! 
 
యుగమేదైనా మనిషికి, మనీషిగా మహితాత్ముడు!
_________

కామెంట్‌లు