ధ్వని-ఫ్రతిధ్వని.:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797..
మనిషి అంతరిక్షాన ఎదిగాడు,
మంచి పాతాళానికి తొక్కాడు!

విశ్వాన కోటీశ్వరులు మెరుగు,
ధర్మాత్ములు మనకనుమరుగు!

భూమి వ్యాపారం మీద ఉంది!
మోసం వీచే జోరుగాలి అంది!

కళ కాసుల వెంట పడుతోంది, 
జీవకళ పంట ఎండిపోతోంది! 

సంస్కృతి తల దించుకుంది,
నాగరికత వేయి తలలేసింది!

భక్తి సుగుణాల కెంతో దూరం,
ఆర్భాటం సాగర ఆవలి తీరం! 

లాభమంతా కొందరి సొంతం,
నష్టం అందరికీ  దారాదత్తం! 

వైద్యరంగం అతి ఆధునికత, 
రోగాల వీరంగగతి వాస్తవికత!

అందరి హస్తాల నీడని నేస్తం, 
అదుపుతప్ప భస్మాసురహస్తం!

అధర్మం అన్ని దారుల,
            పరుగుల పోట్ల గిత్త,
ధర్మం ఉన్నదొక్కటి దారి ,
         నడక నగుబాట్ల నత్త! 
_________


కామెంట్‌లు