(ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా)=================================నా పంచపదుల సంఖ్య---1680-1683.===========================1680.పుస్తకం హస్తభూషణం ,మస్తకజ్ఞానభాండాగారము!పుస్తకం వీడని నేస్తం, విశదపరచు సమస్తము!పుస్తకం చదవ నిండుగా,ఉన్న అజ్ఞానము మాయము!చదవకుంటే నీవు మరి,చీకటిబావి మండూకము!పుస్తక సాంగత్యమే,సజ్జన పరోక్ష సంభాషణము,పివిఎల్!1681.ప్రపంచాన్ని చూడలేదని,రానీకు ఏమాత్రము చింత!పుస్తక ప్రపంచం విహరించు,విశ్వం నీ పాదాల చెంత!భాషలు వేరైనా సద్భావాలు, విశ్వమంతా పాలపుంత!బహు భాషలు నేర్వాలి, ఎదగాలి హిమాలయమంత!మానవ సంబంధ బలోపేత, సాధనాలు పుస్తకాలే,పివిఎల్!1682.చదువు వాచక తపస్సు నిత్యము జ్ఞానమే ఉషస్సు!క్రమేపీ తొలగు తమస్సు,మరి ప్రకాశించు మనస్సు!ప్రకాశించే మనస్సే ,మనిషికి, తరగని తేజస్సు!మనిషి మనీషి కావాలంటే, పుస్తకమిచ్చు ఓజస్సు!కనిపించే దైవం కావ్యం,కావ్య లక్ష్యమే విశ్వశ్రేయస్సు,పివిఎల్!1683.పుస్తకాలున్న గృహమే,సర్వదా ప్రశాంత నిలయము!పుస్తకాలతోనే సాధ్యము, పిల్లల మనోవికాసము!పుస్తకం అలంకరణ కాదు, ఆచరణ ప్రేరకము!పుస్తకాలు చదివిద్దాము ,భావిపౌరుల నిర్మిద్దాము!రచయిత మరణించి,ఇల అక్షరమై జీవిస్తాడు,పివిఎల్!_________
పుస్తకం-విశ్వహితం.:- డా పివిఎల్ సుబ్బారావు.-9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి