: ఉడుతా భక్తి ::- ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు- సారవకోట -చరవాణి : 9490904976
ఉడత ఉడతా..
చిన్నారి బుడతా..

చెట్లు ఎక్కడం..
చిగురుకి సాగడం..
చెంగున ఎగరడం నీ సరదా..
ఆకులు, రెమ్మలు నీకు పరదా..

నరులకైన లేదు నీ మంచి నడత..
పరమాత్ముని సేవలో
పరోపకారిగా మారిన ఓ ఉడత..

సారధి కాకున్నా..
నీ రోమాలతో, వాలంతో కాసింత
ఇసుకను
వారధికై చేర్చి, ఉడుతా భక్తిగా రాముల వారికి సాయం..
అది రామభక్తునిగా నీ ఘన సాయం..

మీ సేవకి మంత్రముగ్ధుడై..
మీ తనువులపై..
మహిమాన్విత మర్యాదరాముడు
ముచ్చటగా వేసెను
తన చేతితో చారలుగా మూడు ముద్రలు.. 
మీ మేనుకవి శ్రీరాముని చిన్ముద్రలు, చెరుగని, చిరకాలపు ఆభరణాలు..


కామెంట్‌లు