జయహో మహిళా :- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497

 ఓ మహిళా 
నిన్ను నువ్వునూతనంగా 
ఆవిష్కరించుకో
నువ్వెళ్ళేదారిలో నిన్ను అవమానపరిచే, 
అవహేళన చేసే ప్రగతి నిరోధక శక్తులెన్నో పొంచి ఉంటాయి 
ఏ శక్తి నిన్ను ఆపలేదు
దృఢసంకల్పం నీ సొంతం 
శక్తి వంచన లేని 
శ్రమ నీ ఆయుధం విజయం 
నీ పాదాక్రాంతం 
నువ్వు సకల శాస్త్రాలు అవపోసన పట్టావు
భూమ్యాకాశాల్లో నువ్వు పాదంమోపని చోటుందా!?
ఓ అతివ నువ్వు కాదు అబల
నువ్వు సబల 
కించిత్తు ఆత్మన్యూనతా భావం నీలో లేక 
నువ్వెందరికో ఆదర్శనీయురాలవై
మున్ముందు కెళ్ళు
ఈ ప్రయాణం తోటి మహిళామణులకు మార్గమవ్వాలి
తొలి అడుగెప్పుడు ఒంటరే
నువ్వు అజేయమైన కీర్తిప్రతిష్టలు సొంత చేసుకున్ననప్పుడు
చుట్టూ ఉన్న సమాజం నిన్ను వేనోళ్ళ కొనియాడుతుంది
ఇంటా బయటా విభిన్న రకాల బాధ్యతలతో
ఓఆలిగా
అమ్మగా 
ఓఆదర్శ అధికారిగా 
ఉత్తమ పాలనాదక్షురాలిగా
అత్యుత్తమ నాయకురాలిగా
ఉత్తమ సేవకురాలుగా
విభిన్న రంగాల్లో 
మీ (నీ)విశిష్టతను చాటుకుంటున్నారు
బహుముఖీన నీ(మీ) ప్రతిభకు జోహార్లు 
జయహో మహిళా 
జయతు జయతు 
ఓ మహిళా
కామెంట్‌లు