రత్నగర్బఅవని
ఎడారి చేయకు నీ దుశ్చర్యలతో
ప్రేమామృతమూర్తి
జనని
దూషించకు నీ పాపపునోటితో
నీకేమికావాలంటుంది అవని
నీజన్మ ప్రదాతే జనని
అన్ని తానై భూతలమంతా
నిండినది అవని
తన సర్వంమనమై మనమే తన లోకంగా బ్రతుకుతున్నది జనని
అవనిని నీ దురాశతో కాలుష్యకాసారంచేయకు
ముందు తరానికి పంచభూతాలను విషతుల్యం చేసి పురిటిలోనే బిడ్డల ఉసురుతీసే కసాయివి నువ్వు కాకు
అమ్మ గర్భాన్ని చేధించి భూతలనికి వచ్చిన మనము
ఆ అమ్మే మనకు ప్రత్యక్ష దైవం
అమ్మ కంటకన్నీరొలికిన
బిడ్డలకు శ్రేయస్కరం కాదు
అది మన ఆయుస్సుక్షీణం
అవని గర్భం ధరించిన విశేషఖనిజసంపదను
వన సంపదను కొల్లగొట్టి
జీవ వైవిధ్యాన్ని పాడుచేసి
గ్లోబల్ వార్మింగ్,త్సునామి
సుడిగాలులు
ఇసుకతుఫానులు
అకాల వర్షాలు
ఆశనిపాతాలు
వంటి పెను ప్రమాదాలు మానవుడిఅధమసృష్టేగదా!
ఇది సకలమానవాళి
మనుగడకు విఘాతం కల్గించేదేగదా!
ప్లాస్టిక్ వ్యర్ధాలు,
ఫ్లోరిన్ కల్గిన నీరు
సేంద్రియ ఎరువుల వాడకం తగ్గి,
అత్యాశతో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం
తినే ఆహారం ,
పీల్చే గాలి
పంటపండేభూములు ,
నింగిని తూట్లు పొడిచి రహస్యాలు చేధించే కుట్ర కోణం,
నిప్పు పుట్టిన తర్వాతే
మానవ మనుగడ
ప్రమాదపు అంచున నిలిచిన వైనం,
కన్నతల్లే కల్పవల్లి
భూ తల్లే సకల చరాచర జగత్తుకు జీవనాడి
ఏ తల్లికి ముప్పువాటిల్లినా!?
ఆ తల్లుల బిడ్డలమైన
మన బ్రతుకులు దుర్భరం ,దుర్లభం
ధరణి రక్షతి రక్షితః
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి