ఒకప్పుడు పల్లె తల్లి లెక్క ఉండె
ఇప్పుడు పట్నం సోకులు పులుముకొని
కృత్రిమంగా మారుతోంది
నాడూ నా పల్లె తల్లి
నీకేమి కావాలనేది
నేడు పట్నం సోకులు పులుముకొని
నేడు పల్లెప్రియురాలు వలే
నాకేమిస్తావంటుంది
నాడు నా పల్లె
పచ్చని చెట్లతో
పాడిపంటలతో తులతూగేది
నేడు యాంత్రిక వ్యవసాయంతో
సేంద్రియ ఎరువులు కనుమరుగై
రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది
నా పల్లెలో
ఒకప్పుడు కల్లు సారాయే దొరికేది అదే
తాగేది
ఇప్పుడు స్వదేశీ విదేశీ మద్యంతో నా పల్లె మత్తులో జోగాడుతుంది
పల్లెలో కూడా ఇప్పుడు
ఆంటీ అంకుల్ విషసంస్కృతి దిగుమతై వావి వరసలకు వక్రభాష్యం చెప్తుంది
ఇప్పుడు నా పల్లె సంకరీకరణతో
మహా నగరంలామారలేక
తన సహజత్వాన్ని పుణికి పుచ్చుకోలేక
రెంట చెడ్డ రేవడైంది
పల్లెలు దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలని
పల్లెమన మూలవేరని
పల్లె మనం సేదదీరే
కన్నతల్లి ఒడి అని నినదిద్దాం2
పల్లెలను కాపాడుకుందాం2
కాంక్రీట్ జంగల్ విష సంస్కృతి నుండి
మట్టిని ప్రేమించే
మట్టి మనుషులుగా
మనంసహజంగా
జీవించడానికి పల్లెల్ని
పునర్ నిర్మించుకుందాం2
మన పల్లెతల్లులకళ్ళలో
ఆత్మగౌరవరేఖ
పొడచూపేలా
చేద్దాం!?
పల్లెల సహజత్వాన్ని భంగపరిచే ఎటువంటి విధ్వంసాన్నైనా
మనం వ్యతిరేకిద్దాం !?2
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి