నాదేశంభూతలస్వర్గం:- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748498
ఎవరిపై 
మీ (అ) పవిత్ర యుద్ధం ( జీహాద్)
నిరాయుధులపై
తెగబడి కాల్చడం
ఏమతం అభిమతంగా 
ఉందో ఒకసారి తెలియపరచు...!?

ఓరి సంఘవిద్రోహి..!
ఓఅసాంఘిక శక్తి !?
ఎవడొదిలినబాణానివిరా .
నీవు..!
అభంశుభం తెలియనివారల
ఉసురు తీసిన దురాత్మకుండా!?

ఉన్మాదం తలకెక్కించుకొని
సాటి మనుషులే 
మీ శత్రువులుగా ఎంచుకొని 
ధ్వంసం రచనకు
పూనుకుంటారా!?

పర్యటనతో యాత్రికులు
కనుల నిండా కమనీయ దృశ్యాలు వీక్షించి హృదయంలో బంధించి 
వినూత్న ఊహల్లో మనస్సుతేలియాడి
ఆనందాతిశయానికి
వారు లోనయ్యే
సమయాన వారు కన్న కలలను
కన్నీట ముంచావేరా!?

బిడ్డలకు తండ్రిని దూరం చేసి 
భార్యకు భర్తను దూరం చేసి 
కర్కశంగా తుపాకీ తూటాలకు 
బలిజేసిన
ఓ మతోన్మాద సైతాన్ 
ఎంత పాపాన్ని మూటకట్టుకుంటివిగదరా!?
శాంతి నివాసమైన 
మాదేశాన
అశాంతిని రేపిన 
ఓ ముష్కరుడా!?
రక్తదాహానికి మరిగిన
రక్తపిశాచమా!?
నూట నలభై కోట్ల సోదరభారతీయుల
 స్వర్గధామం
ఈ (మా) భారతదేశం 
ఒక్కసారే వెన్నులో భయోత్పాతం
సృష్టించినోడా!?
జల్లెడ పడుతున్నాం
దొరికిన ప్రతీముష్కరునికి 
గన్నుతో సమాధానం చెబుతాం
తస్మాత్ జాగ్రత్త 
భారత్ అంటే శాంతి సహనంమేకాదు
యుద్దమే వస్తే ప్రపంచపటంలో
శత్రుదేశం గల్లంతవకతప్పదు



కామెంట్‌లు