పుస్తకం హస్తభూషణము
మస్తీష్కమును మేలుకొల్పును పుస్తకం
చినిగిన చోక్క అయినా తొడుక్కో
కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అనేది
అనంతకోటి సత్యం
ఒంటరితనాన్ని పోగొట్టునది
నైతికతని పెంపొందించునది
మానవవిలువలు నేర్పునది
మంచి మిత్రున్ని కలుపునది
పుస్తకం.
చీకటిని ప్రారద్రోలునది
వెలుగును ప్రసరించునది
చైతన్యంను కలిగించునది
సమాజంను మేలుకొలుపునది
మంచి పుస్తకం.
వీరులను తయారుచేయునది
మేధావులను వెతికితీయునది
జాతి నిర్మాతలను సృష్టించునది
సృష్టికి ప్రతిసృష్టి చేయుటకు
సహకరించునది పుస్తకం
ఖండాన్తరాలను దాటించునది పుస్తకం.
===========================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి