అబ్బా మైండ్ తిరుగుతుంది :- భైరగోని రామచంద్రము -చరవాణి :9848518597
అబ్బ మైండ్ తిరుగుతుంది 
ఎము చూసుడే ఒక్కటే 
చూసుడు 
పిచ్చి గిట్ల లేసిందా 
చెప్పితే విననే వినరు 
మైండ్ మొత్తం పాడు చేసుకుంటరు 
గీ ఫోన్ పాడుగాను 
సదువు మీద శ్రద్ధ పెట్టుర్రే 
బాగు పడుతరు 

అబ్బ డాడీ ఒక్కసారి ఇవ్వవా 
చూసుకుంట అన్నం తింట 

ఏయ్ మల్ల అడుగుతున్నవ 
పిచ్చి లేపకే చెంప పగులుద్ది 
పుస్తకం చూసుకుంట తిను 
గింత జ్ఞానమన్న వొత్తది 
నాలుగాక్షరాలన్న తెలుత్తవి 
ఎదిగె వయస్సును పాడు 
చేసుకోకుండ్రే 

మాకంటే సదువు లేదు 
కూలీ నాలీ చేసుకుంటూ 
మిమ్మల్ని సదివిస్తుంటే 
మీరేమో గిట్ల జేయవడితిరి 
ఏ పొండ్రే మీతోటి నాకు 
వొశం గాదు 
పల్లెంల అన్నం ఏసుకుని 
ఫోన్ లో లీనమై అన్నం 
కింద కలుపుతుంటిరి 
తినే తిండి కూడా మీకు ఒంట
పడుత లేదాయే 
సెల్ పురుగులై పుడితిరి కదరా 

నా బతుకు నేను బతుకుతా 
మీ బతుకు మీరు బతుకుండ్రి 
 అటు అమ్మ చెపితే వినరైతిరి
ఇటు నేను చెపితే వినరైతిరి 
ఇద్దరికి బిపి లేపితిరి 

అబ్బా అట్లా అనకండె 
మీరు చెప్పినట్టే వింటం 
ఇప్పుడు మాకు తెలిసోచ్చిందే 
ఫోనుకు దూరమవుతాము 
సదువుకు దగ్గరవుతాము 

( ఈ మధ్యకాలంలో పిల్లలు ఫోన్ తో ఎలా ఇబ్బంది పెట్టిస్తున్నారో అర్థం చేసుకొని రాసాను )


కామెంట్‌లు