రామ నవమి;- భైరగోని రామచంద్రము -స్కూల్ అసిస్టెంట్, తెలుగు హైదరాబాద్-చరవాణి :9848518597
లక్ష్మీ సమేతుడైన శ్రీమహావిష్ణువు 
త్రేతాయుగంబున చైత్రశుద్ధ నవమియందు 
కౌశల్య దశరథులకు 
రఘువంశోత్తముడుగా జన్మించెను 
ఇదే రామ నవమి 
రామ అన్నా పాపములు 
పటా పంచలవును 
శత్రువులు పరుగెత్తుదురు 
దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు 
త్రేతాయుగ పురుషుడు 
అవతరించిన రోజే రామ నవమి



మిథిలా నగరమందు జనకుడి 
క్షేత్రంలో భూమిజ అయోనిజగా అవతరించిన జానకిని 
విశ్వామిత్ర సమేతంగా వచ్చి 
శివధనుస్సు నెత్తి 
పరిణయమాడిన రోజే 
రామ నవమి 


తండ్రిమాట జవదాటకుండ 
పదునాలుగు సంవత్సరంబులు 
అరణ్యములోనుండి సీతనెత్తుకెళ్ళిన 
అసురున్ని సంహారించి 
ధర్మపత్నితో అయోధ్యకుదెంచిన 
దాశరథికి పట్టాభిషేకం 
జరిగిన రోజే రామ నవమి 

రామ రాజ్యంలో ప్రజలందరు 
సుఖసంతోషంతో ఉండిరి 
ప్రతీ రోజు రామ నవమి జరుపుకొంటిరి 


( శ్రీరామనవమి సందర్బంగా రాసిన కవిత )


కామెంట్‌లు