కారణ జన్ముడు శ్రీ రామ చంద్రుడు:- -- డా.గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,కర్నూలు జిల్లా, సెల్:9966414580
రామాయణ కావ్యానికి
కథానాయకుడు రాముడు
నిలువెత్తు  ఆదర్శానికి
నిదర్శనమై నిలిచాడు

తన తండ్రి మాట కోసము
కానలకెళ్ళిన తనయుడు
"ఏకపత్నీ పురుషుడు"
ఆ "శ్రీరామ చంద్రుడు"

జానకమ్మ పతిదేవుడు
కౌసల్యమ్మ సుపుత్రుడు
రావణ సంహరకుడు
లక్ష్మణుని ప్రియ సోదరుడు
 
గుణంలోన శ్రీమంతుడు
జన్మతః సత్పురుషుడు
మంచితనానికి చిహ్నము
ఈ అయోధ్య రాముడు

సూర్య వంశాకాశాన
వెలుగొంది

న  భాస్కరుడు
సద్గుణాల్లో శ్రేష్టుడు
కారణ జన్ముడు  రాముడు

మార్గదర్శి నేటి యువతకు
ఘన  జానకీ రాముడు
దేవుడు వైష్ణవ భక్తులకు
మన కోదండ రాముడ

కామెంట్‌లు