అనగనగా శివాపురం అనే గ్రామంలో లోకేశ్వరి, పడగయ్య దంపతులకు భీమయ్య ఒక్కగానొక్క కొడుకు. భీమయ్య ఎప్పుడు ఎవరితో మాట్లాడినా పొగరుగా మాట్లాడేవాడు. అందుకే అందరూ అతనిని పొగరుబోతు భీమయ్య అనేవారు. ఎవరు ఎంత చెప్పినా భీమయ్య తన ప్రవర్తనలో మాత్రం మార్పు తెచ్చుకోలేదు. భీమయ్యకు చదివినా విద్య అబ్బలేదు. భీమయ్యను ఏ ఒక్కరు కూలీ పనికి తీసుకెళ్లినా, పొగరుబోతు మాటలకు మరుసటి రోజు భీమయ్యను పనికి వద్దనేవారు. భీమయ్య ఇంటిబావిలో తీయటినీళ్లు ఉండేవి. భీమయ్య ఎవ్వరికీ మంచినీళ్లు ఇవ్వకుండా మాట్లాడేవాడు.
భీమయ్య పొగరుబోతు మాటలకు తల్లిదండ్రులు బాధపడేవారు. భీమయ్యలో మార్పు వచ్చేదెట్లా, పనిచేస్తేనే పిల్లనిస్తారు కదా! అంటూ మదనపడేవారు. ఒకరోజు శివాలయంలో పూజారిని కలిసి తన కొడుకు ప్రవర్తనలో మార్పు వచ్చేలా సలహా ఇమ్మని పడగయ్య అడిగాడు. పూజారి బాగా ఆలోచించి, చెవిలో ఏదో విషయం చెప్పి పంపాడు. పడగయ్య ఇంటికి వెళ్లి, భీవయ్యని పిలిచి అడవిలోకి వెళ్ళి, విస్తార్లు కుట్టడానికి పచ్చటి మోతుకాకులు తీసుకురమ్మన్నాడు. మంచి ఎండాకాలం భీమయ్య అడవి బాట పట్టాడు. అడవి మధ్యలోకి వెళ్లి సంచినిండా ఆకులు తెంపుకొని, తిరుగు ప్రయాణమయ్యాడు.
కొద్ది దూరం వెళ్ళగానే భీమయ్యకు బాగా దప్పిక వేసింది. పొలాల వద్ద ఉన్న ప్రజలను దప్పిక తీర్చడానికి కాసిన్ని నీళ్లు ఇవ్వమనగా, ఓ పొగరుబోతు భీమయ్య నువ్వు మా నీళ్లు తాగుతావా! మీ ఇంటి బావిలో తీయటి నీళ్లు నువ్వే తాగుపో! లేవు లేవు నీళ్లు అంటూ ప్రజలు పొగరుగా సమాధానం చెప్పారు. భీమయ్య ఏమాత్రం బాధపడకుండా పొగరుగా ఇంటిదారి పట్టాడు. కానీ బాగా దప్పిక చేసింది. భీమయ్యకు వశంగాక మల్లయ్య తాత పొలం వద్దకు పరుగున వెళ్లి, మల్లయ్య తాతను అడగకుండానే కుండలో నీళ్లు గబగబా తాగాడు. భీమయ్య దప్పిక తీర్చుకోవడం చూసిన మల్లయ్య తాత రెండు జామకాయలు చెట్టుకు తెంపి, తినుమని ఇచ్చాడు. భీమయ్య తన తప్పును తెలుసుకున్నాడు. ఎన్నోసార్లు మల్లయ్య తాతను పొగరుగా మాట్లాడినా, తాత తిరిగి ఏమాత్రం పొగరుగా మాట్లాడకుండా ఆకలి తీరుస్తున్నందుకు సంతోషించాడు. అప్పటినుంచి భీమయ్య తన పొగరుబోతు మాటలు మానుకున్నాడు. భీమయ్య తల్లిదండ్రులు ఆనందించి, అడిగిన ప్రజలందరికి కాదనకుండా ప్రజల దప్పిక తీర్చసాగారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి