ఏమాశించి ఈ ఉన్మాదం?
ఎప్పటికీ గెలవదు ఉగ్రవాదం!
రాజ్యంపై అసూయ
ధర్మం పై ద్వేషం
పెంచి పోషించిన
బరితెగించిన తీవ్రవాదం!
మెడకంటిన మాంగల్యపు
పసుపు తడి అరకనే...
కట్టిన వాడు క్షణంలో
కట్టెగా మిగిలిపోతే.....
నవవధువు వేదనను
వర్ణించ లేమంటూ
అక్షరాలు ఆవేదనగా
అశ్రువులు కార్చవా!
అమాయకంగా బలి అయిన
కుటుంబాల కంట కురిసే నీరు
ఉప్పెనగా ఉగ్రవాదుల
వెనుక ఉన్న శక్తులను శపించవా!
వ్యక్తి పైన కాదు
వ్యవహారము కాదు
ధర్మం పై జరిగిన దాడి!
మనకేమని ఊరుకుంటే
మన ఉనికికే ప్రమాదం
కోల్పోయే ముందరే
మేలుకొని తీరాలి!
భరతమాత కలికి తురాయికి
అంటి ఆరని నెత్తురు మరకలు
తుడిపి పచ్చగా ప్రజలు
బ్రతికే ధైర్యం ఇచ్చే వేకువకోసం
వేయికన్నులతో ఎదురుచూస్తూ
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి